AP CM Jagan Revealed Assets Details in Election Affidavit :పేదలకు, పెత్తందారులకు మధ్య పోరాటం జరుగుతోందని, తాను పేదలకు ప్రతినిధినని పదే పదే ఊదరగొడుతున్న ఏపీ సీఎం జగన్ ఒక్కరి పేరిటే 529 కోట్ల 87 లక్షల విలువైన స్థిర, చరాస్తులున్నాయి. ఆయన భార్య భారతిరెడ్డి, కుమార్తెలు హర్షిణిరెడ్డి, వర్షారెడ్డిల పేరిట ఉన్న ఆస్తులనూ కలిపితే వాటి విలువ 757 కోట్ల 65 లక్షలు. ఇది జగన్ కుటుంబ ఆస్తుల విలువ. వీటిల్లో అత్యధిక మొత్తం వివిధ కంపెనీల్లో వాటాలు, పెట్టుబడుల రూపంలో ఉన్నవే. జగన్ తరఫున వైఎస్ మనోహర్‌రెడ్డి పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్, అఫిడవిట్ సమర్పించారు. అందులో ఆస్తుల విలువను పొందుపరిచారు. 2019లో జగన్ ఒక్కరి ఆస్తుల విలువ 375కోట్ల 20 లక్షలు కాగా గత అయిదేళ్లలో ఆయన ఆస్తుల విలువ 154 కోట్ల 67 లక్షల మేర అంటే 41.22 శాతం పెరిగింది. 2019లో జగన్ కుటుంబం మొత్తం ఆస్తుల విలువ 510 కోట్లు 38 లక్షలు కాగా అయిదేళ్లలో 247 కోట్ల 27 లక్షలు అంటే 48.45 శాతం పెరిగింది.
పెరిగిన ఆస్తులు : 2024 అఫిడవిట్ ప్రకారం జగన్ చరాస్తులు 483 కోట్ల 8 లక్షల 35వేల 64 రూపాయలు. 2019లో 339 కోట్ల 89 లక్షల 43 వేల 352 రూపాయలు మాత్రమే. 2024లో స్థిరాస్తులు 46కోట్ల 78 లక్షల 89 వేల 930 రూపాయలు. 2019లో 35 లక్షల 30 వేల 76 వేల 374 రూపాయలు మాత్రమే. 2024లో మొత్తం ఆస్తి 529కోట్ల 87 లక్షల 24 వేల 994 రూపాయలుగా చూపారు. 2019 అఫిడవిట్‌లో 375 కోట్ల 20 లక్షల 19వేల 726 రూపాయలు మాత్రమే. ఇక భారతిరెడ్డికి 2024 లో 119 కోట్ల 38 లక్షల 7వేల 913 రూపాయల చరాస్తులు ఉన్నట్లు చూపారు. 2019లో 92కోట్ల 53 లక్షల 49 వేల 352 రూపాయలుగా ఉంది.
2024లో స్థిరాస్తులు 56 కోట్ల 92 లక్షల 19 వేల 841 రూపాయలుగా పేర్కొన్నారు. 2019 అఫిడవిట్‌లో 31 కోట్ల 59 లక్షల 2వేల 925గా ఉంది. 2024లో మొత్తం ఆస్తుల విలువ 176 కోట్ల 30లక్షల 27వేల 754 రూపాయలుగా చూపగా 2019లో 124 కోట్ల 12 లక్షల 52వేల 277రూపాయలుగా ఉంది. జగన్ మోహన్‌రెడ్డి పెద్దకుమార్తె హర్షిణిరెడ్డికి 2024 అఫిడవిట్‌లో చరాస్తులు 24 కోట్ల 26లక్షల 10వేల 726 రూపాయలు ఉన్నట్లు చూపారు. 2019లో 6కోట్ల 45లక్షల 62వేల 191 రూపాయలు ఉంది.
2024లో స్థిరాస్తులు కోటి 63లక్షల 58వేల 650గా పేర్కొన్నారు. 2019లో ఏమీ లేవు. 2024లో హర్షిణిరెడ్డి మొత్తం ఆస్తుల విలువ 25కోట్ల 89 లక్షల 69వేల 376 రూపాయలుగా చూపారు. 2019లో మొత్తం ఆస్తులు 6కోట్ల 45 లక్షల 62 వేల 191 రూపాయలుగా ఉంది. ఇక వర్షారెడ్డికి 2024లో చరాస్తులు 23 కోట్ల 94 లక్షల 23 వేల 727గా చూపారు. 2019లో 4కోట్ల 59లక్షల 82 వేల 372గా ఉంది. 2024లో స్థిరాస్తులు కోటి 63లక్షల 58 వేల 650గా చూపారు. 2019లో స్థిరాస్తులేవీ లేవు. 2024లో ఆస్తుల విలువ 25 కోట్ల 57 లక్షల 82వేల 377గా ఉంది. 2019లో 4 కోట్ల 59 లక్షల 82 వేల 372 రూపాయలుగా చూపారు.
2024లో కుటుంబం మొత్తం చరాస్తులు 650 కోట్ల 66 లక్షల 77 వేల 430గా చూపారు. 2019లో 443కోట్ల 48 లక్షల 37వేల 267గా ఉంది. స్థిరాస్తుల మొత్తం 2024లో 106 కోట్ల 98 లక్షల 27 వేల 71గా పేర్కొనగా 2019లో 66 కోట్ల 89లక్షల 79వేల 299 రూపాయలుగా ఉంది. 2024లో కుటుంబం మొత్తం ఆస్తుల విలువ757 కోట్ల 65 లక్షల 4వేల 501 రూపాయలు కాగా 2019లో510 కోట్ల 38 లక్షల 16 వేల 566 రూపాయలుగా ఉంది. ఐదేళ్లలో ఆస్తుల విలువ భారీగా పెరిగినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
సొంత కారు లేని జగన్: ఎన్నికల అఫిడవిట్‌లో కోట్ల రూపాయల ఆస్తులను చూపిన జగన్ ఒక్కరికి కూడా సొంత కారు లేదని పేర్కొన్నారు. వాళ్ల పేరుతో కార్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో ఎక్కడా చూపలేదు. జగన్ పేరుతో ఒక బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో వాహనం ఉంది. అది తన సొంతానిది కాదని, హోం మంత్రిత్వశాఖ సమకూర్చిన వాహనమని అఫిడవిట్‌లో ప్రస్తావించారు. జగన్, ఆయన కుటుంబీకులకు వివిధ కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
జగన్‌కు ఏడు కంపెనీల్లో, ఆయన భార్య భారతికి 22 కంపెనీల్లో, వాళ్ల కుమార్తెలు హర్షిణిరెడ్డికి 7 కంపెనీల్లో, వర్షారెడ్డికి 9 కంపెనీల్లో పెట్టుబడులున్నట్లు చూపారు. వీరందరికీ కలిపి వివిధ కంపెనీల్లో 344 కోట్ల 3లక్షల 77 వేల 886 విలువైన పెట్టుబడులున్నాయి. జగన్ పేరిట ఏడు కంపెనీల్లో 263 కోట్ల 64 లక్షల విలువైన ఈక్విటీ షేర్లు ఉన్నాయి. భారతీ సిమెంట్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, కార్మెల్ ఏషియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్లాసిక్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్, హరీష్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమటెడ్, సండూర్ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిడెట్ కంపెనీల్లో జగన్‌కు 263 కోట్ల 64 లక్షల 92వేల 685 విలువైన షేర్లు ఉన్నాయి.
రిలయన్స్‌లో పెట్టుబడులు : రిలయన్స్, జియో ఫైనాన్స్‌లో భారతిరెడ్డి పెట్టుబడులు ఉన్నట్లు అఫిడవిట్‌లో చూపారు. భారతిరెడ్డికి 69 కోట్ల 42 లక్షల 10వేల 710 రూపాయల పెట్టుబడులున్నాయి. 11 కంపెనీల్లో 53కోట్ల 8 లక్షల 47 వేల 931 విలువైన ఈక్విటీ షేర్లు ఉన్నాయి. సండూర్ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, కెల్వెన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, క్లాసిక్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్, సిలికాన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్, హరీష్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, ఆకాశ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, భారతి సిమెంట్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, రేవన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, యుటోపియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో ఈ షేర్లు ఉన్నాయి.
మకరియోస్ ఎల్‌ఎల్‌పీ, భగవత్ సన్నిధి ఎస్టేట్స్ ఎల్‌ఎల్‌పీల్లో 13కోట్ల 94 లక్షల 91 వేల 693 రూపాయల విలువైన పెట్టుబడులతో పరిమిత భాగస్వామ్యం ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ఫైనాన్షియల్స్, ఎన్‌ఎండీసీ, ఏషియన్ పెయింట్స్, కోల్గేట్ పామోలివ్, ఓఎన్‌జీసీ, సెయిల్, ఆల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్‌లో కోటి 52 లక్షల 17 వేల 143 రూపాయల పెట్టుబడులున్నాయి. 75.01 లక్షల విలువైన సావరిన్ గోల్డ్ బాండ్లున్నట్లు అఫిడవిట్‌లో చూపారు.