తెలంగాణ

telangana

ETV Bharat / politics

రాహుల్‌ పిల్ల చేష్టల హామీలు - మోదీ గ్యారంటీ మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి : అమిత్‌షా - AMIT SHAH BHUVANAGIRI MEETING NEWS - AMIT SHAH BHUVANAGIRI MEETING NEWS

Amit Shah Speech At Bhuvanagiri Meeting Today : అబద్ధాలతో ఈ ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ చూస్తోందని కేంద్ర మంత్రి అమిత్​ షా విమర్శించారు. ఈ ఎన్నికలు నరేంద్ర మోదీ, రాహుల్​ గాంధీ మధ్య జరుగుతున్నాయన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొన్నారు.

Amit Shah Election Campaign in Yadadri Bhuvanagiri
Amit Shah Election Campaign in Yadadri Bhuvanagiri

By ETV Bharat Telangana Team

Published : May 9, 2024, 1:01 PM IST

Updated : May 9, 2024, 2:30 PM IST

రాహుల్‌ పిల్ల చేష్టల హామీలు - మోదీ గ్యారంటీ మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి : అమిత్‌షా

Amit Shah Election Campaign in Bhuvanagiri Today : ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికలు నరేంద్ర మోదీ, రాహుల్​ గాంధీ మధ్య జరుగుతున్నాయని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​ షా అన్నారు. ఓట్​ ఫర్​ జిహాద్​, ఓట్​ ఫర్​ అభివృద్ధి మధ్య జరుగుతున్న ఎలక్షన్స్ ఇవి అని తెలిపారు. కుటుంబ అభివృద్ధి, దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధికి మధ్య జరుగుతున్న పోరు అని చెప్పారు. రాహుల్​ పిల్ల చేష్టల హామీలు, మోదీ గ్యారంటీ మధ్య జరుగుతున్న ఎన్నికలని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా పాల్గొన్నారు. బీజేపీ భువనగిరి లోక్​సభ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్​కు మద్దతుగా ప్రచారం చేశారు.

Amit Shah Slams Congress :మూడు విడతల ఎన్నికల్లో ఇప్పటికే 200 సీట్లకు పైగా స్థానాలు గెలిచామని కేంద్రమంత్రి అమిత్​ షా స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 400కు లోక్​సభ స్థానాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో గత ఎన్నికల్లో నాలుగు లోక్​సభ సీట్లు గెలిచామని, ఈసారి మొత్తం 10కి పైగా సీట్లు గెలుస్తామన్నారు. తెలంగాణలో డబుల్​ డిజిట్​ స్కోర్​, దేశంలో 400 సీట్లకు మార్గం సుగమం అవుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ పరిస్థితి దయనీయంగా తయారైందని, ఆ పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకట్లేదని విమర్శించారు.

"అబద్ధాలతో ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్​ పార్టీ యత్నం. మోదీ మళ్లీ వస్తే రిజర్వేషన్లు తొలగిస్తారని అవాస్తవాలు చెబుతున్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ల ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు నష్టం. ముస్లింల 4 శాతం రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇస్తాం. మోదీ ఏది చెబుతారో అది తప్పకుండా చేస్తారు. రాహుల్‌ గాంధీ గ్యారంటీలు చెల్లే పరిస్థితి లేదు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అమలు కాలేదు. రైతులకు ఏటా రూ.15 వేల ఆర్థికసాయం అమలు చేయలేదు. రైతు కూలీలకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం నెరవేర్చలేదు. వరి, గోధుమలకు రూ.500 బోనస్‌ హామీ అమలు చేయలేదు. రైతులకు పూచీ లేకుండా రూ.5 లక్షల రుణ హామీ నెరవేరలేదు. ప్రతి మండలంలో అంతర్జాతీయ పాఠశాల హామీ నెరవేర్చలేదు. కాంగ్రెస్‌ చేసిన వాగ్దానాలను ఎన్నటికీ నెరవేర్చదు. మోదీ చేసిన వాగ్దానాలు తప్పకుండా అమలు చేస్తారు." - అమిత్​ షా, కేంద్ర మంత్రి

పోచంపల్లిలో టెక్స్​టైల్​ పార్కు : భువనగిరి టెక్స్​టైల్​ పరిశ్రమల కోసం మోదీ కృషి చేశారని కేంద్రమంత్రి అమిత్​ షా తెలిపారు. కొత్త టెక్స్​టైల్​ విధానంతో 8 లక్షల మంది చేనేత కార్మికులకు ఉపాధి లభించనుందన్నారు. రూ.1,500 కోట్లతో జాతీయ టెక్స్​టైల్​ విధానం అమల్లోకి తెచ్చామని పేర్కొన్నారు. రూ.14 వేల కోట్లతో పోచంపల్లిలో టెక్స్​టైల్​ పార్కు ఏర్పాటుకు కృషి చేస్తామని మాటిచ్చారు. బీబీనగర్​లో ఎయిమ్స్​ నిర్మించి పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. జనగాం నుంచి భువనగిరి వరకు రైల్వే లైన్ల ఆధునీకరణ చేపట్టామన్న అమిత్ షా, కొమురవెల్లిలో అత్యాధునిక రైల్వేస్టేషన్​ నిర్మిస్తున్నామని వెల్లడించారు. రాయగిరి నుంచి వరంగల్​ వరకు 4 వరుసల రహదారి నిర్మించామని వివరించారు.

"కశ్మీర్​ ఎప్పటికీ భారత్​లో అంతర్భాగమే. రాజస్థాన్​, తెలంగాణ ప్రజలకు కశ్మీర్​తో ఏం సంబంధమని ఖర్గే ప్రశ్నించారు. కశ్మీర్​ కోసం భువనగిరి వాసులు తమ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం. ఆర్టికల్​ 370 రద్దు చేసి కశ్మీర్​లో త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా చేశారు. ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని పరిసమాప్తం చేశారు. ప్రధాని మోదీ దేశాన్ని సురక్షితంగా ఉంచారు. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ రెండూ కలిసి మజ్లిస్​ను అడ్డుకోగలవా? కాంగ్రెస్​, బీఆర్​ఎస్​, మజ్లిస్​ పార్టీల మధ్య త్రికోణ బంధం ఉంది. మూడు పార్టీలు హైదరాబాద్​ విమోచన దినోత్సవం నిర్వహించరు. మూడు పార్టీలు సీఏఏను వ్యతిరేకించాయి. రద్దు చేసిన ట్రిపుల్​ తలాక్​ పునరుద్ధరణకు యత్నిస్తున్నారు."- అమిత్​ షా, కేంద్ర మంత్రి

పసుపుబోర్డు ప్రధాన కార్యాలయం నిజామాబాద్​లోనే పెడతాం : అమిత్​షా - Amit Shah Campaign in Telangana

ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను బీజేపీ కాపాడుతుంది : అమిత్ షా - Amit Shah Secunderabad Meeting

Last Updated : May 9, 2024, 2:30 PM IST

ABOUT THE AUTHOR

...view details