ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

జోరుగా ఓట్ల వేట - ప్రచారంలో దుసుకుపోతున్న కూటమి అభ్యర్థులు - Election Campaign - ELECTION CAMPAIGN

Alliance Candidates in Statewide Election Campaign: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో దూకుడు పెంచారు. సభలు, సమావేశాలు నిర్వహించి ఓటర్లతో మమేకమవుతున్నారు. ఎక్కడికక్కడ వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశంలో చేరుతున్నారు.

election_campaign
election_campaign

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 13, 2024, 10:49 AM IST

Updated : Apr 13, 2024, 11:59 AM IST

Alliance Candidates in Statewide Election Campaign:టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్‌కుమార్‌ గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోని పలు మండలాల్లో సుడిగాలి ప్రచారం చేశారు. శ్రావణ్‌కుమార్‌కు ఓటు వెయ్యాలంటూ రాజధాని రైతులు, దళిత బహుజనులు ఇంటింటికీ వెళ్లి కోరారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్‌ తగిలింది. చినగంజాం మండలంలో వెయ్యి మంది వైసీపీ నేతలు టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. బల్లికురవ మండలం వల్లాపల్లి గ్రామంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవి ఇంటింటి ప్రచారం చేశారు.

జోరుగా ఓట్ల వేట - ప్రచారంలో దుసుకుపోతున్న కూటమి అభ్యర్థులు

జనసేన ఎంపీ అభ్యర్తి వల్లభనేని బాలశౌరి మండలి బుద్ధప్రసాద్‌తో కలిసి కోడూరు మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మైలవరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్‌ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన పలువురు కీలక వైసీపీ నేతలు టీడీపీ గూటికి చేరారు. కంచికచర్ల మండలం గొట్టిముక్కల గ్రామంలో మాజీ సర్పంచ్‌ రంగారావు, ఎంపీటీసీ సరస్వతి ఆధ్వర్యంలో 250 కుటుంబాలు తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. కూచిపూడిలో టీడీపీ అభ్యర్థి వర్ల కుమార్‌రాజా ఇంటింటికీ వెళ్లి సూపర్‌ సిక్స్‌ పథకాలను వివరించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో తెలుగుదేశం అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

సైకిల్​కి సై ఫ్యాన్ కు నై అంటున్న ఉభయగోదావరి జిల్లాలు - political situation in AP

శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ సమక్షంలో కసిమివలస గ్రామంలోని 50 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. పాతపట్నంలో టీడీపీ అభ్యర్ధి మామిడి గోవిందరావు భారీ ప్రచార ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆనం రామనారాయణరెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు. కోవూరులో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నెల్లూరులో టీడీపీ అభ్యర్థి నారాయణ భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిఈ ర్యాలీలో పాల్గొన్నారు.

కర్నూలు జిల్లా పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరు చరిత గడివేముల మండలంలో రోడ్‌ షో, ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నందవరం మండలం ముగతిలో జయహో బీసీ బహిరంగ సభలో కర్నూలు టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు నాగరాజు, జయనాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. అనంతరం కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్‌తో కలిసి ఎన్నికల ర్యాలీ చేశారు. కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ. భరత్‌ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహిళలకు టీడీపీ సూపర్‌ సిక్స్‌ పథకాలపై అవగాహన కల్పించారు. నంద్యాల జిల్లా సున్నిపెంటలో వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గుండయ్య యాదవ్‌ శ్రీశైలం ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్‌రెడ్డి సమక్షంలో టీడీపీ గూటికి చేరారు. డోన్‌ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. బేతంచర్ల మండలం బుక్కాపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

మాట ఇవ్వటం మడమ తిప్పటం జగనన్నకు అలవాటే! - Jagan False Promises

అనంతపురం టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ నగరంలోని పలు వార్డులలో విస్తృతంగా ప్రచారం చేశారు. గుంతకల్లులో వైసీపీకి గట్టిదెబ్బ తగిలింది. టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం సమక్షంలో 300 మంది వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అనంతరం ఎంపీ అభ్యర్థి అంబిక లక్ష్మీనారాయణతో కలిసి ఆయన పలు వార్డుల్లో సభలు, సమావేశాలు నిర్వహించారు. హిందూపురం లోక్‌సభ ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి కురుబ సామాజిక వర్గ నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వేలాది మంది హాజరై మద్దతు తెలిపారు. హీరేహాల్‌ మండలం గొడిసెలపల్లిలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు జయహో బీసీ సభ నిర్వహించారు. బత్తలపల్లి మండలంలో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

చిత్తూరు జిల్లా ఐలవారిపల్లిలో 300 మంది వైసీపీని వీడి టీడీపీలో చేరారు. పూతలపట్టు అభ్యర్థి మురళీమోహన్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్సార్‌ జిల్లా పెండ్లిమర్రి మండలం పగడాలపల్లికి చెందిన 40 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ఏపీ చంద్రారెడ్డి గార్డెన్స్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి, ఎంపీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం మూడు పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు.

ప్రతిపక్షాలకు డీజీపీ అపాయింట్‌ మెంట్‌ లేదు- అందుకే సీఈఓకి ఫిర్యాదులు: టీడీపీ నేతలు - TDP leaders complain to CEO

Last Updated : Apr 13, 2024, 11:59 AM IST

ABOUT THE AUTHOR

...view details