AICC Warning To Party Leaders : పార్టీలో అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలపై మీడియా ముందుకు వెళ్తున్న నాయకులపై ఏఐసీసీ సీరియస్ అయింది. పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది. ఇటీవల లోక్‌సభ అభ్యర్ధుల ప్రకటనపై ఇద్దరు సీనియర్ నాయకులు వ్యతిరేక స్వరం వినిపించడంపై ఆ పార్టీ నాయకత్వం స్పందించింది. ఇప్పటికే పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌తో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ, రోహిత్ చౌదరి, మహేష్‌కుమార్ గౌడ్ చర్చలు జరిపారు. మరొక్కసారి వ్యతిరేకంగా మాట్లాడొద్దని హెచ్చరించారు.
Congress Mahesh Kumar Goud To Party Leaders :మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు మీడియా సమావేశంలో పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మట్లాడడాన్ని కూడా రాష్ట్ర నాయకత్వం ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లింది. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరడం కార్యకర్తలు సహించడం లేదని ఆయన తెలిపారు. దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం స్పందించింది. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నిర్ణయాలను అందరూ ఆమోదించాల్సిందేనన్నారు. భిన్నాభిప్రాయాలు పార్టీలో అంతర్గతంగా తెలియజేయాలన్న ఆయన క్రమశిక్షణ ఉల్లంఘించే వారు పార్టీలో ఎంత సీనియర్ అయినా చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ నిర్ణయానుసారం నడవాలన్నారు.
లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ వ్యూహం - అత్యధిక స్థానాలే లక్ష్యంగా దిశానిర్దేశం