ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

ఫార్ములా ఈ కార్‌ రేసింగ్‌పై ఏసీబీ కేసు నమోదు - A1గా కేటీఆర్‌ - ACB CASE ON FORMULA E CAR RACING

2022 నవంబర్​లో హుస్సేన్‌ సాగర్‌ తీరంలో ఇండియన్‌ రేసింగ్‌ - హెచ్‌ఎండీఏ బోర్డు, ఆర్థికశాఖ, ఆర్బీఐ అనుమతి లేకుండానే రూ.55 కోట్ల చెల్లింపులు - విదేశీ సంస్థకు నగదు చెల్లింపులపై దర్యాప్తు

acb_case_on_ktr_on_car_racing
acb_case_on_ktr_on_car_racing (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 19, 2024, 4:36 PM IST

Updated : Dec 19, 2024, 5:16 PM IST

ACB CASE ON FORMULA E CAR RACING :తెలంగాణ ప్రభుత్వం ఫార్ములా ఈ-కార్ రేసింగ్​పై విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. రేసింగ్​లో అవకతవకలపై కేసులో ఏ1గా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి, బీఆర్​ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, ఏ2గా ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌ కుమార్‌, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డిని నమోదు చేసింది. కేసు విచారణ నిమిత్తం ఏసీబీ త్వరలోనే నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

ఫార్ములా ఈ-కార్ రేసింగ్​ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై విచారణ జరిపేందుకు గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ ఇటీవలే అనుమతులు మంజూరు చేశారు. గవర్నర్‌ అనుమతితో సర్కారు తదుపరి చర్యలకు ఉపక్రమించగా కేబినెట్ సమావేశంలో నిర్ణయం మేరకు ఈ-కార్ రేసింగ్​పై విచారణ చేపట్టాలని ఏసీబీకి చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి లేఖ రాశారు. కార్‌ రేసింగ్‌లో విదేశీ సంస్థకు నగదు చెల్లింపులపై దర్యాప్తు జరగనుంది. హెచ్‌ఎండీఏ బోర్డు, ఆర్థికశాఖ, ఆర్బీఐ అనుమతి లేకుండానే రూ.55 కోట్ల చెల్లింపులు జరిగాయని, దాదాపు రూ.46 కోట్ల వరకు డాలర్ల రూపంలో చెల్లించారనేది ప్రధాన ఆరోపణ. విదేశీ సంస్థకు నగదు చెల్లింపులపై ఏసీబీ విచారణ చేపట్టనుంది.

ఫార్ములా ఈ కార్ రేసింగ్ వివాదంపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేటీఆర్ అరెస్టుపై తానేమీ చెప్పలేనని, చట్టం తన పని తాను చేస్తుందని గతంలో వ్యాఖ్యానించారు. ఏజెన్సీలపై కూడా కేసు నమోదయ్యే అవకాశం ఉందన్న ఆయన, నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఎవరు ఇచ్చారు? నిధులు ఎక్కడికి చేరాయి? అని అనుమానాలు లేవనెత్తారు. డబ్బులు ఎవరెవరి చేతులు మారాయో ఏసీబీ విచారణలో తేలుతుందని పేర్కొన్నారు. ఈ అంశంలో భారీ అవినీతి జరిగిందని, ఇందిరమ్మ ప్రభుత్వంలో కక్ష సాధింపు ఉండదని, అవినీతిని ప్రజల ముందుంచడమే తమ ఉద్దేశమని చెప్పారు.

2022 నవంబర్​లో హైదరాబాద్​లోని హుస్సేన్‌ సాగర్‌ తీరంలో ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ జరిగింది. స్ట్రీట్‌ సర్క్యూట్‌పై స్పోర్ట్స్‌ కార్లు పరుగులు తీశాయి. క్వాలిఫైయింగ్ 1, 2 తర్వాత రేస్ 1 స్పిన్ట్​ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

సాగర్ ​తీరాన మళ్లీ రయ్.. రయ్​.. వచ్చే నెలలోనే ఈ-రేసింగ్​ పోటీలు

రేసింగ్‌ కార్లతో దద్దరిల్లిన సాగర్‌ తీరం.. పోటీలను వీక్షించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌ తీరంలో మరోసారి కార్‌ రేసింగ్‌.. ట్రాఫిక్ ఆంక్షలు

Last Updated : Dec 19, 2024, 5:16 PM IST

ABOUT THE AUTHOR

...view details