తెలంగాణ

telangana

ETV Bharat / photos

ప్రపంచంలోనే అతి పెద్ద క్రూజ్ షిప్ తొలి విహారం​​- ఒకేసారి 10 వేల మంది ప్రయాణం - ప్రపంచంలోనే అతి పెద్ద విహార నౌక

World Biggest Cruise Ship : ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్‌ నౌక విహారానికి సిద్ధమైంది. అమెరికాలోని మయామీ తీరం నుంచి జనవరి 27 సాయంత్రం ఈ నౌక తొలి ప్రయాణాన్ని ప్రారంభించింది. వారం రోజుల పాటు కరీబియన్ దీవులను చుట్టేయనుంది. ఈ అతిపెద్ద నౌక ప్రత్యేకలు ఓ సారి చుద్దాం.

By ETV Bharat Telugu Team

Published : Jan 28, 2024, 8:39 AM IST

Updated : Jan 28, 2024, 8:47 AM IST

Icon Of The Seas : ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్​ నౌక 'ఐకాన్​ ఆఫ్​ ది సీస్​​' తొలి విహారాన్ని ప్రారంభించింది.
రాయల్​ కరీబియన్ సంస్థకు చెందిన ఈ నౌక, అమెరికాలోని ఫోరిడా రాష్ట్రం మయామీ పోర్టు నుంచి జనవరి 27 సాయంత్రం బయలుదేరింది. వారం రోజుల పాటు సముద్ర జలాలపై విహరిస్తూ వివిధ దీవులను చుట్టేయనుంది.
ఈ నౌక దాదాపు 1,200 అడుగులు (365 మీటర్లు). గంటకు గరిష్ఠంగా 22 నాటికల్‌ మైళ్ల (41 కి.మీ) వేగంలో ప్రయాణించగలదు.
ఈ విలాసవంత నౌకలో 20 డెక్‌లు, ఆరు వాటర్‌స్లైడ్‌లు, ఏడు ఈత కొలనులు, ఐస్ స్కేటింగ్ రింక్, సినిమా థియేటర్, 40కి పైగా రెస్టారెంట్‌లు, బార్లు ఉన్నాయి.
ఈ నౌకకు 2,350 మంది సిబ్బంది, గరిష్ఠంగా 7,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యం ఉంది
ఇంటర్‌ మయామీ సీఎఫ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌లో సభ్యుడైన ప్రముఖ క్రీడాకారుడు మెస్సి, అతడి సహచరులు కలిసి ఈ నౌకకు పేరు పెట్టారు.
తూర్పు కరేబియన్ దీవులు చుడుతూ ఫిబ్రవరి 3న ఈ నౌక తిరిగి మయామీకి చేరుకోనుంది.
ప్రపంచలోనే అతి పెద్ద క్రూజ్​ నౌక
Last Updated : Jan 28, 2024, 8:47 AM IST

ABOUT THE AUTHOR

...view details