తెలంగాణ

telangana

ETV Bharat / photos

"మీ వాలెంటైన్​"కు విషెస్​ చెప్పండిలా - స్పెషల్ ఫేస్​బుక్ & వాట్సాప్​ స్టేటస్​ - VALENTINES DAY 2025 WHATSAPP STATUS

Valentines Day 2025 WhatsApp and Facebook Status: ప్రేమ, లవ్​, ఇష్క్​, కాదల్,​​ ఇలా ప్రేమకు భాష ఏదైనా భావం ఒక్కటే. ప్రేమ ఒక అనిర్వచనీయమైన అనుభూతి. ఒక్కమాటలో చెప్పాలంటే ఏ బంధమూలేని తొలి సంబంధమే ప్రేమ. మరి ప్రేమికుల రోజు రానే వచ్చింది. ఈరోజున ఈటీవీ భారత్​ అందిస్తోన్న కోట్స్​ను వాట్సాప్​, ఫేస్​బుక్​ స్టేటస్​గా పెట్టుకుని మీ ప్రియమైన వారిని ఇంప్రెస్​ చేసేయండి. (Getty Images)

By ETV Bharat Telangana Team

Published : Feb 13, 2025, 3:13 PM IST

"మద్యం ఇవ్వలేని మత్తు నీ ప్రేమలో చూశా పద్యం పలకలేని భావం నీ కళ్లలో చూశా సేద్యం తెలియని మనసులో నీ గురించి కొత్త కలలను చూశా" హ్యాపీ వాలెంటైన్స్​ డే బంగారం (Getty Images)
"జీవితం ఓ ప్రయాణం జీవనం ఓ ప్రమాణం నీతో జీవితం నాకు ప్రయాణం కావాలి నీ ప్రేమ నాకు ప్రమాణం కావాలి" - ప్రేమికుల రోజు శుభాకాంక్షలు (Getty Images)
"మరచిపోవడానికి నువ్వు జ్ఞాపకం కాదు నా జీవితం వదిలేయడానికి నువ్వు వస్తువు కాదు నా ప్రాణం పక్కన పెట్టడానికి నువ్వు పరాయి దానివి కాదు నా ఆత్మవి" - హ్యాపీ వాలెంటైన్స్​ డే డార్లింగ్​ (Getty Images)
"నన్ను నీ కళ్లలో పెట్టుకోకు - కన్నీళ్లలో కొట్టుకుపోతాను హృదయంలో ఉంచుకో - ప్రతి స్పందనకు గుర్తుంటాను" - హ్యాపీ వాలెంటైన్స్​ డే డియర్​ (Getty Images)
"ఘడియ చాలు నీ గుండె సవ్వడి తెలుసుకోవడానికి క్షణము చాలు నీ కంటి పాపలో నన్ను చూసుకోవడానికి కానీ జీవితం కూడా సరిపోదు నా ప్రేమను వ్యక్తం చేయడానికి" - ప్రేమికుల రోజు శుభాకాంక్షలు (Getty Images)
"నువ్వే నేనైతే నీ ప్రేమ నాదే నా తొలివలపు నీవైతే నీ ప్రాయం నేనే" - హ్యాపీ వాలెంటైన్స్​ డే డార్లింగ్​ (Getty Images)
నా ఆనందంలో నువ్వు నా ఊహల్లో చిత్రం నువ్వు "నా గుండెలో చప్పుడు నువ్వు నేను అనే పదానికి అర్థం నువ్వు" - ప్రేమికుల దినోత్సవం బంగారం (Getty Images)
"నా ఊహల్లో చిత్రం నువ్వు నా నిద్రలో కలవు నువ్వు నన్ను నేను తట్టి చూసుకుంటే ఆ పులకరింతకు చిరునామా నువ్వు" - హ్యాపీ వాలెంటైన్స్​ డే డార్లింగ్​ (Getty Images)
"ఓ ప్రియతమా నీ గమ్యం లేని గమనం లేదు నా పయనానికి నీ రూపం లేని స్వప్నం లేదు నా కనులకి"- హ్యాపీ వాలెంటైన్స్​ డే మై క్యూట్​ డెవిల్​ (Getty Images)
"ప్రేమంటే సూర్యునిలా ఉదయించి సాయంత్రం అస్తమించేదు కాదు, కళ్లలో ఉదయించి, కనుమూసేంతవరకు అస్తమించనిది ప్రేమ. అది జీవితాంతం మనిద్దరి మధ్య ఉండాలి" - హ్యాపీ వాలెంటైన్స్​ డే డార్లింగ్​ (Getty Images)

ABOUT THE AUTHOR

...view details