Tornadoes in America : అమెరికాను శక్తిమంతమైన టోర్నడోలు కుదిపేస్తున్నాయి.. అమెరికాలోని టెక్సాస్. ఓక్లహామా. ఆర్కన్సాస్‌లను శక్తిమంతమైన టోర్నడోలు బీభత్సం సృష్టించాయి.. టోర్నడోలు ధాటికి ఇప్పటివరకు 18 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.. భీకర గాలుల విధ్వంసానికి అనేక చోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి.. టోర్నడోల వల్ల పెద్ద సంఖ్యలో చెట్లు నేలకూలాయి.. విద్యుత్తు లైన్లు కూలిపోవడం వల్ల సరఫరాకు ఆటంకం ఏర్పడింది.. వందలాది ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.. డల్లాస్. డెంటన్ తదితర చోట్ల ఏర్పడిన టోర్నడోల వల్ల అనేక వాహనాలు తిరగబడ్డాయి.. వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.. టెక్సాస్‌లో ఓక్లహామా సరిహద్దు సమీప ప్రాంతాల్లో టోర్నడో బీభత్సానికి ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు మృతిచెందారు.. టెక్సాస్‌లో టోర్నడోలు వల్ల 100మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.. టెక్సాస్‌లో 200 పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి.. గాయపడిన వారిని హెలికాప్టర్. అంబులెన్స్ సాయంతో ఆస్పత్రికి తరలిస్తున్నారు.. పశ్చిమ టెక్సాస్. న్యూ మెక్సికో. అరిజోనా. కొలరాడో. ఓక్లహామాలోని కొన్ని ప్రాంతాల్లో కార్చిచ్చులు ఏర్పడే ప్రమాదం ఉందనే హెచ్చరికలు జారీ అయ్యాయి.. అమెరికాలో టోర్నడోలు బీభత్సం