Sankranti Muggulu: సంక్రాంతి అంటే ముగ్గుల పండగ. అందుకే కొన్ని రోజుల ముందు నుంచే ఏమేం ముగ్గులు వేయాలో ప్లాన్ చేసుకుంటారు. ముగ్గు పిండి నుంచి కావాల్సిన రంగులను సిద్ధం చేసుకుంటారు. చుక్కలు, గీతలు, పక్షులు, పువ్వులు, అబ్బో ఒక్కటేమిటి ఎన్ని రకాలుగా వీలుంటే అన్ని రకాలుగా వేసి సంబురపడతారు. మరి మీరు కూడా అందమైన ముగ్గులను ఇంటి ముందు వేయాలనుకుంటున్నారా? అయితే మీ కోసం కొన్ని డిజైన్స్ పట్టుకొచ్చాం. (ETV Bharat)