పెద్దవాగు ప్రాజెక్టుకు గండి - ఆరు గ్రామాల్లో వరద విధ్వంసం - RAINS IN ANDHRA PRADESH - RAINS IN ANDHRA PRADESH
Rains in Andhra Pradesh: వరుణుడి ఉగ్రరూపానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. ఇళ్లు, పొలాలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తెలంగాణలోని పెద్దవాగు ప్రాజెక్టుకు పడిన గండి ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంపై తీవ్ర ప్రభావం చూపింది. మొత్తం ఆరు గ్రామాల్లో వరద విధ్వంసం సృష్టించగా పదుల సంఖ్యలో బాధితులు నిరాశ్రయులయ్యారు. అకస్మాత్తుగా వచ్చిన వరదతో ఇంట్లో సామాన్లు కొట్టుకుపోగా కట్టుబట్టలతో మిగిలిపోయారు. (ETV Bharat)
అల్లూరినగర్లో వరద బీభత్సం సృష్టించింది. పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. అల్లూరినగర్లో రంగమ్మకు చెందిన ఇళ్లు కొట్టుకుపోగా మంచం మాత్రమే ఇలా కనిపించింది. (ETV Bharat)అల్లూరినగర్లో కొట్టుకుపోయిన రహదారి (ETV Bharat)అల్లూరినగర్లో కొట్టుకుపోయిన రహదారి (ETV Bharat)వేలేరుపాడు మండలం కోయమాదారం సమీపంలోని కొడిసెలవాగులో గల్లంతైన కారు ఇదే. కారును చూస్తున్న స్థానికులు (ETV Bharat)మేడేపల్లిలో వరదతీవ్రతకు బస్సు చెంత ఇలా (ETV Bharat)వేలేరుపాడు మండలం విప్పలగుంపు సమీపంలోని కోతకు గురైన రహదారి చెంత స్థానికుల రాకపోకలు (ETV Bharat)వేలేరుపాడు మండలం మేడేపల్లిలో వరద తీవ్రతకు కోతకుగురైన ఇళ్లు (ETV Bharat)సాయం కోసం ఎదురుచూపులు (ETV Bharat)వేలేరుపాడు మండలం విప్పలగుంపు సమీపంలోని కోతకు గురైన రహదారి చెంత అనారోగ్యంతో బాధపడుతున్న మేడేపల్లి వీఆర్ఎ
వెంకటరత్నాన్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చుతున్న స్థానికులు (ETV Bharat)
కోయమాదారంలోని ఇళ్లల్లో బురదను తొలగిస్తూ.. (ETV Bharat)వేలేరుపాడు మండలం మేడేపల్లిలో వరద తీవ్రతకు కుంగిన ఇంట్లోని సామగ్రిని వ్యాన్లోనికి తరలిస్తున్న చిత్రాలు (ETV Bharat)కోయమాదారంలో పాడైన బియ్యాన్ని చూపుతూ.. (ETV Bharat)కోయమాదారంలో వరద బాధితులను పరామర్శిస్తున్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు (ETV Bharat)వేలేరుపాడు మండలం మేడేపల్లిలో వరద తీవ్రతకు కోతకుగురైన ఇళ్లు (ETV Bharat)వేలేరుపాడు మండలం మేడేపల్లిలో వరద తీవ్రతకు కోతకుగురైన ఇళ్లు (ETV Bharat)వేలేరుపాడు మండలం మేడేపల్లిలో వరద తీవ్రతకు కుంగిన ఇంట్లోని సామగ్రిని వ్యాన్లోనికి తరలిస్తున్న చిత్రాలు (ETV Bharat)కోయమాదారంలో దెబ్బతిన్న అరటితోట (ETV Bharat)అల్లూరినగర్లో వరద తీవ్రతకు కొట్టుకుపోయిన ఆటో (ETV Bharat)