Ram Navami Ayodhya Laddu Prasad : అయోధ్య రామమందిరానికి ప్రసాదం నిమిత్తం దేవ్‌రహ హాన్స్ బాబా ట్రస్టు 1.11.111 కిలోల లడ్డూలను పంపనుంది.. ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు లడ్డూలను ప్రసాదంగా అందించనున్నారు శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర్ ట్రస్ట్ నిర్వాహకులు.. 1.11.111 కిలోల లడ్డూ ప్రసాదాన్ని త్వరలోనే ఆలయానికి పంపనున్నట్లు యూపీలోని మీర్జాపుర్‌లో దేవ్‌రహ హాన్స్ బాబా ట్రస్టు మెంబర్ అతుల్ కుమార్ సక్సేనా తెలిపారు.. ప్రతి వారం వివిధ ఆలయాలకు లడ్డూ ప్రసాదాన్ని పంపుతున్నామని అతుల్ కుమార్ సక్సేనా చెప్పారు.. కాశీ విశ్వనాథ్ లేదా తిరుపతి వేంకటేశ్వరస్వామి వంటి ఆలయాలకు ప్రతి వారం తాము లడ్డూ ప్రసాదాన్ని పంపుతామని అతుల్ కుమార్ సక్సేనా వెల్లడించారు.. జనవరి 22వ తేదీన అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజు 40 వేల కిలోల లడ్డూలను నైవేద్యంగా పంపినట్లు వెల్లడించారు.. అయోధ్య బాలరాముడు