తెలంగాణ

telangana

ETV Bharat / photos

'మృత్యు' విమానానికి 179 మంది బలి - రన్​వేపైనే అంతా సమాధి! - PLANE CRASH PHOTOS TODAY

దక్షిణ కొరియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 179 మంది ప్రాణాలు కోల్పోయారు. ముందు చక్రం తెరుచుకోక పోవడం వల్ల విమానాశ్రయంలోని కాంక్రీటు గోడను విమానం బలంగా ఢీకొంది. ఈ దుర్ఘటనలో విమానంలోని ఇద్దరు సిబ్బంది మినహా మిగిలిన అందరూ దుర్మరణం పాలయ్యారు. (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Dec 29, 2024, 12:42 PM IST

దక్షిణ కొరియాలోని ముయాన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదానికి కారణం ల్యాండింగ్‌ గేర్‌ వైఫల్యమే అని ప్రాథమికంగా తెలుస్తోంది. (Associated Press)
థాయ్‌ రాజధాని బ్యాంకాక్‌ నుంచి బయల్దేరిన ది జేజు ఎయిర్‌ ఫ్లైట్‌కు చెందిన 7C2216 నంబర్‌ బోయింగ్‌ 737-800 శ్రేణి విమానం ల్యాండ్‌ అవుతూ అదుపుతప్పింది. (Associated Press)
రక్షణ గోడను ఢీకొని మంటల్లో చిక్కుకొని పేలిపోయింది. (Associated Press)
విమానం ల్యాండ్‌ కావడానికి ప్రయత్నించిన సమయంలో ల్యాండింగ్‌ గేర్‌ సమస్యతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. (Associated Press)
ఇద్దరు సిబ్బంది తప్ప మిగిలిన వారంతా మరణించినట్లు తెలుస్తోంది. (Associated Press)
ఈ విమానం అప్పటికే ల్యాండింగ్‌కు యత్నించి విఫలమైందని అధికారులు పేర్కొన్నారు. (Associated Press)
ఇది నేలపైకి దిగిన తర్వాత రన్‌వే చివరికి వస్తున్న సమయంలో కూడా వేగాన్ని నియంత్రించుకోవడంలో విఫలమైనట్లు చెప్పారు. (Associated Press)
ఇది ఎయిర్‌పోర్టు గోడను ఢీకొనడం వల్ల విమానంలో ఇంధనం ఒక్కసారిగా మండిపోయి మంటలు వ్యాపించినట్లు తెలిపారు. (Associated Press)
విమానం నేలపైకి దిగే సమయంలో ల్యాండింగ్‌ గేర్‌, టైర్లు పనిచేయడంలేదని కొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు అధికారులు చెబుతున్నారు. (Associated Press)
ఏదైనా పక్షిని ఢీకొనడం వల్లే అవి పనిచేయకపోయి ఉండొచ్చన్న అనుమానాలున్నాయి. (Associated Press)
దీనిని బలపర్చేలా విమానం ల్యాండింగ్ యత్నించే సమయంలో ఓ ఇంజిన్‌ నుంచి ఒక్కసారిగా నిప్పులు బయటకు వచ్చిన దృశ్యాలను స్థానిక టెలివిజన్‌ ఛానల్‌ ప్రసారం చేసింది. (Associated Press)
విమానం ఇంజిన్‌ను పక్షి ఢీకొనడం, వాతవరణ పరిస్థితుల కారణంగా ల్యాండింగ్‌ గేర్‌లో సమస్య కారణమై ఉండొచ్చని పేర్కొన్నారు దక్షిణ కొరియా ఫైర్‌ చీఫ్‌ లీ జియోంగ్‌ హైయూన్‌. (Associated Press)
ప్రమాదం జరిగిన వీడియో దృశ్యాల్లో కూడా విమానం రన్‌వేపై అదుపుతప్పి దూసుకెళుతూ గోడను ఢీకొనే సమయానికి ల్యాండింగ్‌ గేర్‌ వెనక్కే ఉన్నట్లు భావిస్తున్నారు. (Associated Press)
జరిగిన ప్రమాదానికి థాయ్‌ల్యాండ్‌కు చెందిన జేజు ఎయిర్‌ సంస్థ క్షమాపణలు తెలిపింది. (Associated Press)
ప్రమాద నివారణకు తాము శక్తివంచన లేకుండా ప్రయత్నించినట్లు వెల్లడించింది. (Associated Press)
బాధిత కుటుంబాలకు సాయం చేస్తామని పేర్కొంది. (Associated Press)
దక్షిణ కొరియాలో 1997లో జరిగిన విమాన ప్రమాదంలో 228 మంది మృతి చెందారు. ఆ తర్వాత ఇదే అతిపెద్ద ప్రమాదం. (Associated Press)
ఈ ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 175మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది విమానంలో ఉన్నారు. (Associated Press)
ఇద్దరు సిబ్బందిని ప్రాణాలతో కాపాడారు. 179 మంది మృతి చెందినట్లు యాంహాప్‌ న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది. (Associated Press)
ఈ ఘటనలో విమానం మొత్తం పూర్తిగా కాలిపోయిందని అధికారులు ధ్రువీకరించారు. (Associated Press)
ఈ విమాన ప్రమాదంపై తాత్కాలిక అధ్యక్షుడు చోయ్‌ సాంగ్‌ మోక్‌ స్పందించారు. (Associated Press)
తక్షణమే అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. (Associated Press)
ఈ మేరకు ఇంటీరియర్‌, ల్యాండ్‌ మినిస్టర్లకు, పోలీసులు, అగ్నిమాపక శాఖకు మార్గదర్శకాలు జారీ చేశారు. (Associated Press)
ముయాన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని విమానాల రాకపోకలను రద్దు చేశారు. (Associated Press)
కన్నీరుమున్నీరవుతున్న మృతుల కుటుంబ సభ్యులు (Associated Press)

ABOUT THE AUTHOR

...view details