తెలంగాణ

telangana

ETV Bharat / photos

పాకిస్థాన్​లో తీవ్ర హీట్​వేవ్​- 50డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు- అల్లాడిపోతున్న ప్రజలు - Pakistan Heat Wave 2024 - PAKISTAN HEAT WAVE 2024

Pakistan Heat Wave 2024 : పాకిస్థాన్ నగరాల్లో రికార్డు స్థాయిలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. కొన్ని చోట్ల 50డిగ్రీల సెల్సియస్‌ మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నీటి కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వడదెబ్బతాకి రోజుకు 300మందికిపైగా ఆసుపత్రుల పాలవుతున్నారు. మరో 12 రోజులు ఈ హీట్‌ వేవ్‌ తప్పదని పాక్‌ వాతావరణశాఖ స్పష్టం చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని ప్రభుత్వం సూచించింది. (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : May 24, 2024, 10:42 PM IST

Pakistan Heat Wave 2024 : పాకిస్థాన్‌ ఎండలతో అల్లాడిపోతుంది. చాలా నగరాల్లో ఉష్ణోగ్రతలు దాదాపు 49 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోగా మొహంజదారో వంటి చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత 50డిగ్రీలకు చేరుకుంది. (Associated Press)
కరాచీ వంటి నగరాలు చెట్లు లేక కాంక్రీట్‌ అడవులను తలపిస్తున్నాయి. వందలాది మంది వడదెబ్బకు గురై ఆసుపత్రుల పాలవుతున్నారు. తీవ్రంగా అనారోగ్య పాలై మరణాలకు దారి తీసే పరిస్థితులు ఎదురవుతున్నాయి. (Associated Press)
కనీసం రోజుకు 300 మంది డీహైడ్రేషన్‌కు గురై ఆసుపత్రుల పాలవుతున్నట్లు కరాచీ ప్రభుత్వాస్పత్రి సూపరిండెంట్‌ నిజాముద్దీన్‌ చెప్పారు. వారందరికీ తీవ్రమైన జ్వరంతో వాంతుల అవుతున్నట్లు తెలిపారు. (Associated Press)
రోజురోజుకీ రోగుల సంఖ్య పెరగడంవల్ల ఆసుపత్రుల్లో పడకలు సరిపోవడంలేదని,వారికి అత్యవసర చికిత్స అందించి ఇళ్లకు పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లను వదిలి బయటకు రావద్దని ఇప్పటికే పాక్‌ ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. (Associated Press)
అధిక మోతాదులో నీళ్లను తీసుకోవాలని సూచించింది. వీలైనంత వరకూ చల్లని ప్రదేశాల్లోనే ఉండాలని వివరించింది. ఈ హీట్‌ వేవ్‌ మరో 12 రోజులపాటు ఉంటుందని పాకిస్తాన్‌ వాతావరణశాఖ వెల్లడించింది. (Associated Press)
కానీ, కార్మికులు, దినసరి కూలీలకు ఎండ తిప్పలు తప్పడం లేదు. పూట గడవడం కోసం వారు అధిక ఉష్ణోగ్రతల్లోనే పని చేయాల్సి వస్తోందని వారి కుటుంబాలు వాపోతున్నాయి. (Associated Press)
కరాచీలో మధ్యాహ్న సమయాల్లో బయట తిరిగే పరిస్థితులు లేవు. అధిక ఉష్టోగ్రతల వల్ల నీటి కొరత సైతం వచ్చింది. కొన్నిచోట్ల స్వచ్ఛంద సంస్థలు రోడ్ల పక్కన చలి వేంద్రాలు ఏర్పాటు చేశాయి. (Associated Press)
వాహనదారులకు, బాటసారులకు నీరును అందిస్తున్నాయి. ఎండ తాపం తట్టుకోలేక ప్రజలు తల మీద నీళ్లను పోసుకుంటున్నారు. (Associated Press)
చెట్లు కనమరుగై కాంక్రీట్‌ భవనాలు మాత్రమే ఉండడం వల్లే నగరాలకు ఈ పరిస్థితి దాపరించిందని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడ్డారు. (Associated Press)
తక్కువ ఖాళీ స్థలంతో దగ్గరగా భవనాలు నిర్మించుకోవడం వల్ల చెట్లకు అందాల్సిన నీరు, ఉష్ణోగ్రతలు అందలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా చెట్లు మనుగడ సాధించలేక పోయాయన్నారు. (Associated Press)
పాక్‌లో ఉన్న ఇళ్ల పథకాలు, భారీ భవనాల ప్రాజెక్టులే ఇందుకు కారణమని వెల్లడించారు. దీంతో నగరాలు పచ్చదనాన్ని కోల్పోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. (Associated Press)
ఈ హీట్‌ వేవ్‌ వల్ల హిమనదులు కరిగి వర్షకాలంలో వరదలు సంభవించే అవకాశలున్నట్లు హెచ్చరించారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ప్రకృతి హితమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని పర్యావరణ వేత్త అలాంగిర్‌ సూచించారు. (Associated Press)
ఇందుకోసం ప్రజలు, ప్రభుత్వాలు, ప్రైవేట్‌ సెక్టార్లు స్వచ్ఛందంగా పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. వీలైనన్నీ మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. (Associated Press)
చెరువులు, కుంటలను మళ్లీ పునరుద్ధారించాలన్నారు. లేకపోతే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. (Associated Press)
పాకిస్థాన్ హీట్​ వేవ్ (Associated Press)
పాకిస్థాన్ హీట్​ వేవ్ (Associated Press)
పాకిస్థాన్ హీట్​ వేవ్ (Associated Press)
పాకిస్థాన్ హీట్​ వేవ్ (Associated Press)
పాకిస్థాన్ హీట్​ వేవ్ (Associated Press)
పాకిస్థాన్ హీట్​ వేవ్ (Associated Press Associated Press)

ABOUT THE AUTHOR

...view details