తెలంగాణ

telangana

ETV Bharat / photos

ఇక ఇంటి నుంచే ఓటు- అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో​​ 'మొబైల్​ ఓటింగ్' సౌకర్యం - MOBILE VOTING IN US ELECTIONS

Mobile Voting In US Elections : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు, పోలింగ్‌ కేంద్రాల్లోనే కాకుండా ఇంటి వద్దనే ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు అక్కడి అధికారులు. ఇందుకోసం మొబైల్‌ ఓటింగ్‌ వ్యాన్‌ను ఏర్పాటు చేశారు. తొలిసారి పెన్సిల్వేనియా రాష్ర్టంలోని మోంట్‌గోమేరీ కౌంటీలో మెుబైల్‌ ఓటింగ్‌ వ్యాన్‌ను అందుబాటులోకి తెచ్చారు. (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Oct 24, 2024, 5:09 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికలు- ఓటింగ్ శాతం పెంచేందుకు పెన్సిల్వేనియా రాష్ట్రంలో తొలిసారి మొబైల్​ ఓటింగ్ (Associated Press)
అమెరికాలో నవంబర్‌ 5న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన అభ్యర్థులు డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు జరుగుతోంది. (Associated Press)
ఈసారి ఓటింగ్‌ శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు అక్కడి ఎన్నికలు అధికారులు కూడా వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. (Associated Press)
ఇంటి వద్దే ఉండి ఓటు వేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల వరకు వెళ్లే అవసరం లేకుండా బ్యాలెట్‌ బాక్స్‌నే ఓటరు వద్దకు తీసుకువెళుతున్నారు. ఇందుకోసం మెుబైల్‌ ఓటింగ్‌ వ్యాన్‌ సౌకర్యాన్ని ప్రారంభించారు. (Associated Press)
పెన్సిల్వేనియా రాష్ట్రంలోని మోంట్‌గోమేరీ కౌంటీలో తొలిసారి మెుబైల్‌ ఓటింగ్‌వ్యాన్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఓటర్లు ఈ వ్యాన్‌ వద్దకు వచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకోవచ్చని మోంట్‌గో మేరీ కౌంటీ కమీషనర్‌ నీల్‌ మఖిజా తెలిపారు. (Associated Press)
ఈ వ్యాన్‌ వద్దకు వచ్చి మెయిల్-ఇన్-బ్యాలెట్‌ ద్వారా తమ ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటికే పలువురు ఓటు వేసినట్లు చెప్పారు. (Associated Press)
ఈ వ్యాన్‌ వద్దకు వచ్చి మెయిల్-ఇన్-బ్యాలెట్‌ ద్వారా తమ ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటికే పలువురు ఓటు వేసినట్లు చెప్పారు. (Associated Press)
ముందుస్తుగా ఓటు వేసే వాళ్ల కోసమే ఈ మెుబైల్‌ ఓటింగ్‌ వ్యాన్‌ను ప్రారంభించినట్లు మోంట్‌గో మేరీ కౌంటీ కమిషనర్‌ నీల్‌ మఖిజా వెల్లడించారు. (Associated Press)
మోంట్‌గో మేరీ కౌంటీలో 90 వేల మంది జనాభా ఉంటే 60 వేల మందికి ఓటు హక్కు ఉన్నట్లు తెలిపారు. (Associated Press)
అభ్యర్థి గెలుపు అవకాశాలను నిర్ణయించడంలో ఈ కౌంటీ కీలకంగా మారనుందని అందుకే ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నీల్‌ విజ్ఞప్తి చేశారు. (Associated Press)
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పెన్సిల్వేనియా రాష్ట్రం కీలకంగా ఉంటుంది. స్వింగ్‌ రాష్ట్రాల్లో అత్యధిక ఎలక్టోరల్‌ ఓట్లు పెన్సిల్వేనియాలోనే ఉన్నాయి. (Associated Press)

ABOUT THE AUTHOR

...view details