తెలంగాణ

telangana

ETV Bharat / photos

ఒక వ్యక్తి కోటికాంతుల మణిహారం - అదే రామోజీరావు భావజాలం - MEDIA LEGEND RAMOJI RAO IDEOLOGY

Media Legend Ramoji Rao Ideology : ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి, జీవితంలో సమున్నత శిఖరాలకు ఎలా ఎదగొచ్చో నిరూపించారు ఆయన. కోట్లాది మందిని ఎలా ప్రభావితం చేయవచ్చో చేతల్లో చూపారు. కోట్లాది ప్రజలను చైతన్యవంతులను చేయడం, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చడం ఎలాగో చాటి చెప్పారు. ఆయనే అక్షరయోధుడు, ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు. (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 8, 2024, 5:20 PM IST

ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి ఎంత ఎత్తుకు ఎదగవచ్చు?జీవితకాలంలో ఎన్ని కోట్ల మందిని ఎలా ప్రభావితం చేయవచ్చు? (ETV Bharat)
సమాజంలోని చెడును ఎలా రూపుమాపవచ్చు? కోట్ల మంది ప్రజలను ఎలా చైతన్యవంతం చేయవచ్చు? (ETV Bharat)
లక్షల మందికి ప్రశ్నించడం ఎలా నేర్పవచ్చు? చేసే ప్రతి పనిలోనూ ప్రజా ప్రయోజనాన్ని ఎలా నెరవేర్చవచ్చు? (ETV Bharat)
కోట్లమంది పనిచేసే వ్యవసాయ రంగాన్ని ఎలా లాభదాయకంగా మలచవచ్చు? కోట్లాది విద్యార్థుల్లో జ్ఞాన సంపదను ఎలా పెంపొందించవచ్చు? (ETV Bharat)
లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలా ఉపాధి కల్పించవచ్చు? కోట్లాది మహిళల్లో ఆత్మ విశ్వాసం ఎలా రగిలించవచ్చు? (ETV Bharat)
ప్రతి ఒక్కరిలోనూ ఆరోగ్యం పట్ల, వైద్యం పట్ల అవగాహన ఎలా కలిగించవచ్చు? వేల సంవత్సరాల భాషను ఎలా సుసంపన్నం, ఆధునికం చేయవచ్చు? (ETV Bharat)
కళను ఎలా వెలికతీయవచ్చు? కళాకారులను ఎలా వెలుగులోకి తేవచ్చు? మారుమూలన దాగి ఉన్న స్వరసంపదను ఎలా గుర్తించవచ్చు? (ETV Bharat)
వితరణ గుణాన్ని ప్రేరేపించి వేలాది జీవితాల్లో వెలుగెలెలా పూయించవచ్చు? చిన్న మొత్తాల పొదుపుతో కలల్ని సాకారం చేసుకునేందుకు ఎలా తోడ్పడవచ్చు? (ETV Bharat)
సమాజంలో అన్ని రంగాలనూ ఎలా చైతన్యవంతం చేయవచ్చు? తిరిగి ఆ సమాజానికి రక్షణగా ఎలా నిలవవచ్చు? (ETV Bharat)

ABOUT THE AUTHOR

...view details