తెలంగాణ

telangana

ETV Bharat / photos

అక్టోబర్ 7 మారణహోమానికి ఏడాది- గాజా, లెబనాన్​పై ఇజ్రాయెల్ నిప్పుల వర్షం - israel intense attacks on lebanon - ISRAEL INTENSE ATTACKS ON LEBANON

Israel Intense Attacks On Lebanon: హమాస్‌తో మధ్య యుద్ధం మెుదలై సోమవారం నాటికి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఇజ్రాయెల్‌ దాడులను మరింత తీవ్రతరం చేసింది. హమాస్‌, హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా గాజా, లెబనాన్‌లో మరోసారి భీకర వైమానిక దాడులు చేసింది. ప్రతీకారంగా ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరాలపై హెజ్‌బొల్లా రాకెట్లు దూసుకెళ్లాయి. హెజ్‌బొల్లా ప్రయోగించిన దాదాపు 130కిపైగా రాకెట్లు తమ భూభాగంలోకి వచ్చాయని, వాటిని తాము అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్‌ వెల్లడించింది. (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Oct 7, 2024, 9:58 AM IST

సోమవారం నాటికి హమాస్‌తో యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తయిన వేళ ఇజ్రాయెల్‌ దాడులను మరింత ముమ్మరం చేసింది. (Associated Press)
హమాస్‌, హెజ్‌బొల్లా లక్ష్యంగా భీకర దాడులు చేసింది. సోమవారం తెల్లవారుజామున గాజా, లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్‌ దళాలు వైమానిక దాడులు జరిపాయి. (Associated Press)
గాజాలోని ఓ మసీదుపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో 19 మంది దుర్మరణం పాలయ్యారు. (Associated PressAssociated Press)
అటు హెజ్‌బొల్లా స్థావరాలపై గురి పెట్టిన ఇజ్రాయెల్‌ దళాలు, లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో దాడులు కొనసాగిస్తున్నాయి. (Associated Press)
ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు బీరుట్‌లోని పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్‌ సైన్యం వరుస దాడులు జరిపాయి. (Associated Press)
ఈ దాడులతో పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ముగ్గురు చిన్నారులు సహా మొత్తం ఆరుగురు మరణించారు. (Associated Press)
మరోవైపు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా పెద్ద సంఖ్యలో రాకెట్లవర్షం కురిపించింది. ఇజ్రాయెల్‌లోని మూడో అతిపెద్ద నగరమైన హైఫాపై ఈ తెల్లవారుజామున హెజ్‌బొల్లా ఫాది 1 క్షిపణులతో విరుచుకుపడింది. (Associated Press)
ఇజ్రాయెల్‌ రక్షణ దళం-IDF స్థావరాలు లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసింది. దాదాపు 130కిపైగా రాకెట్లు తమ భూభాగంలోకి వచ్చాయని, వాటిని తాము అడ్డుకున్నట్లు IDF వెల్లడించింది. (Associated Press)
ఐదు రాకెట్లు మాత్రం తమ భూభాగాన్ని తాకాయని ధ్రువీకరించింది. రాకెట్‌ దాడి కారణంగా ఓ మెయిన్‌ రోడ్డు, రెస్టరంట్, ఇల్లు ధ్వంసమయ్యాయని ఇజ్రాయెల్‌ వెల్లడించింది. (Associated Press)
ఈ ఘటనలో పదిమంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. (Associated Press)
అటు ఏ క్షణమైనా దాడులు చేస్తామన్న ఇజ్రాయెల్‌ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్‌ అప్రమత్తమైంది. విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. కాసేపటికి వాటిని పునరుద్ధరించింది. (Associated Press)
తొలుత ఆదివారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది. (Associated Press)
అయితే తర్వాత గతరాత్రి 11 గంటల నుంచి షెడ్యూల్‌ ప్రకారం విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయని ఇరాన్‌ పౌర విమానయాన సంస్థ వెల్లడించింది. (Associated Press)

ABOUT THE AUTHOR

...view details