Is Public USB Ports Are Safe : మీరు ప్రయాణాలు చేసేటప్పుడు బస్సుల్లో, రైల్వే స్టేషన్లలో ఫోన్‌ను ఛార్జ్ చేస్తుంటారా? అయితే జర జాగ్రత్త! సైబర్ నేరగాళ్లు మీ ఫోన్‌లోని ఫొటోలు, వీడియోలు, పాస్‌వర్డ్‌లు, ఫైల్స్, మెసేజ్‌లు సహా విలువైన, సున్నితమైన డేటాను తస్కరించే అవకాశం ఉంది. అంతేకాదు ఫైనాన్సియల్ డేటాను దొంగిలించి, ఆర్థికంగా మిమ్మల్ని దోచుకునే ప్రమాదం ఉంది. ఎలా అంటే?
విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, కేఫ్‌లు, హోటల్‌ల్లో - యూఎస్‌బీ పోర్ట్‌లు ఉంటాయి. వీటిని ఉపయోగించి ప్రయాణికులు తమ ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇలాంటి చోట్ల ఛార్జింగ్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, సైబర్ నేరగాళ్లు ఛార్జింగ్ పోర్ట్‌లకు కొన్ని పరికరాలను కనెక్ట్ చేసి, వాటిలో మాల్వేర్‌ను ఇన్‌స్టాల్ చేస్తారు. ఎవరైనా ఆ ఛార్జింగ్ పోర్ట్‌లను ఉపయోగిస్తే, వెంటనే వారి డేటాను సైబర్ నేరగాళ్ల కొట్టేస్తారు. అంతేకాదు వారి మొబైల్ డివైజ్‌ల్లో హానికరమైన సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్ చేస్తారు. అంటే మీ మొబైల్‌ను పూర్తిగా తమ నియంత్రణలో ఉంచుకుంటారు. అందుకే సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఈ స్కామ్‌ను 'జ్యూస్ జాకింగ్' అని అంటారు. కనుక పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో ఫోన్ ఛార్జింగ్ పెట్టకపోవడమే మంచిది. లేకుంటే మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
డేటా ఎలా చోరీ చేస్తారంటే?
- ఫోన్ ఛార్జింగ్ చేసేందుకు పబ్లిక్ స్టేషన్లలోని ఛార్జింగ్ కేబుళ్లను కూడా వీలైనంత వరకు వాడకూడదు. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు వీటిని మాల్వేర్‌లతో ట్యాంపర్ చేస్తుంటారు లేదా వాటిలో ముందుగానే మాల్వేర్‌ను ప్రీలోడ్ చేసి ఉంటారు.
- అలాగే మీ డివైజ్‌ను పూర్తిగా స్కాన్ చేయడానికి వీలుగా సైబర్ నేరగాళ్లు క్రాలర్ ప్రోగ్రామ్‌లను ఉపయోగిస్తారు. దీని ద్వారా మీ ఫోన్‌లోని డేటాను క్లోన్ చేసి, దానిని తమ సిస్టమ్‌కు బదిలీ చేసుకుంటారు.
- సైబర్ కేటుగాళ్లు లేటెస్ట్ మాల్వేర్ ప్రోగ్రామ్లు ఉపయోగించి, మీ డివైజ్‌ను రిమోట్‌గా యాక్సెస్ చేస్తుంటారు. అంటే మీ కార్యకలాపాలాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, మీ ఫోన్‌ను పూర్తిగా నియంత్రిస్తూ ఉంటారు. అందుకే ఫోన్ ఛార్జింగ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఈ జాగ్రత్తలు మస్ట్!
- దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఫోన్ ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది. అందుకే వీలైనంత వరకు సొంత ఛార్జర్, పోర్టబుల్ పవర్ బ్యాంక్‌లు తీసుకెళ్లాలి.
- మీ ఫోన్‌లో మంచి యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
- వీలైనంత వరకు పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌ల్లో ఫోన్ ఛార్జ్ చేయకపోవడమే మంచిది. ఒక వేళ తప్పని పరిస్థితుల్లో ఛార్జింగ్ పెట్టాల్సి వస్తే డేటా బ్లాకర్‌ను ఉపయోగించండి.
- డేటా బ్లాకర్ అనేది మీ ఛార్జింగ్ కేబుల్‌కు ఎటాచ్ చేసుకునే ఒక చిన్న డివైజ్. ఇది మీ ఫోన్‌లోని డేటా - సైబర్ నేరగాళ్లకు చేరకుండా చక్కగా అడ్డుకుంటుంది.
- యూఎస్‌బీ పోర్ట్‌లకు బదులుగా స్టాండర్డ్ త్రీ-పిన్ ఎలక్ట్రిక్ అవుట్‌లెట్ ప్లగ్‌లను మొబైల్ ఛార్జింగ్ కోసం ఉపయోగించండి.
సైబర్ దాడుల నుంచి సురక్షితంగా ఉండాలా? ఈ టాప్-6 టిప్స్ మీ కోసమే! - How To Protect From Cyber Crime
ఆన్లైన్ షాపింగ్ తెగ చేస్తుంటారా? ఈ టిప్స్ ఫాలో అయితే మీరెప్పుడూ సేఫ్! - Online Safe Shopping Tips