Blade Found in Biryani In Hyderabad : సాధారణంగా చికెన్ బిర్యానీ వండాలంటే చికెన్‌తో పాటు లవంగాలు, దాల్చిన చెక్క వంటి సుగంధ ద్రవ్యాలతో పాటు కొత్తి మీర, పుదీనా, నెయ్యి వేసి చేస్తుంటారు. ఇవి అన్ని పెనంలో పడిన తర్వాత చికెన్ బిర్యానీకి వచ్చే టేస్టే అదరహో అనిపిస్తుంది. కానీ అవేమీ కాకుండా ఈ మధ్య జెర్రిలు, బల్లులు, బొద్దింకలు చికెన్ బిర్యానీలో దర్శనమిస్తున్నాయి. ఇలాంటివి చాలా చోట్లనే జరుగుతున్నాయి. ఆ మధ్య హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ జెర్రీ, కప్పలు వచ్చాయన్న వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ సృష్టించాయి. కొన్ని రోజుల క్రితం టాబ్లెట్ కూడా కనిపించింది. ఇలా వరుస సంఘటనలతో బయట బిర్యానీ తినాలంటేనే జనం బయపడుతున్నారు.
బిర్యానీలో బ్లేడ్ : తాజాగా మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధి ఆదర్శ్ బార్ అండ్ రెస్టారెంట్లో బిర్యానీలో బ్లేడ్ కలకలం రేపింది. దీంతో కస్టమర్లు కంగుతిన్నారు. యాదాద్రి భువనగరి జిల్లా బీబీ నగర్ మండలం మక్త అనంతారం గ్రామానికి చెందిన బింగి ఐలయ్య అతడి స్నేహితులతో కలిసి ఆదర్శ్ బార్ అండ్ రెస్టారెంట్లో బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. అందరూ కలిసి బిర్యానీ తింటుండగా, ప్లేట్లో బ్లేడ్ రావడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇదేంటని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. కావాలని రాలేదని, అనుకోకుండా వచ్చిందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో బాధితుడు ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
బావర్చి హోటల్లోనూ అదే తీరు - బిర్యానీ తింటుండగా ట్యాబ్లెట్ ప్రత్యక్షం
అల్వాల్‌లోని ఓ హోటల్లో బిర్యానీలో బొద్దింక - కిచెన్‌లోకి వెళ్లి చూస్తే!