తెలంగాణ

telangana

ఐస్​ల్యాండ్​లో మరోసారి అగ్నిపర్వతం విస్ఫోటనం- 3కి.మీ వ్యాపించిన లావా, అధికారులు అలర్ట్

By ETV Bharat Telugu Team

Published : Feb 9, 2024, 10:46 AM IST

Iceland Volcano Erupts Again : ఐస్‌ల్యాండ్‌లోని గ్రిండ్‌వాక్‌కు ఉత్తరాన ఉన్న సిలింగర్‌ఫెల్‌ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. దీంతో సమీపంలోని ప్రాంతాలకు లావా వ్యాపిస్తుందని ఐస్‌ల్యాండ్‌ వాతావరణ కార్యాలయం తెలిపింది. ఆ ఫొటోలు మీ కోసం.
ఐస్‌ల్యాండ్‌లోని నైరుతి ప్రాంతంలో మరోసారి అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది.
గ్రిండ్‌వాక్‌కు ఉత్తరాన ఉన్న సిలింగర్‌ఫెల్‌ అగ్నిపర్వతం విస్ఫోటన కావడం వల్ల భారీగా లావా నింగిలోకి ఉప్పొంగింది.
అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెప్పారు.
ఎలాంటి డిసెంబర్​ నుంచి ఇప్పటివరకు మూడుసార్లు అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది.
గురువారం ఉదయం ఆరు గంటల సమయంలో ఈ అగ్నిపర్వతం ప్రభావం సుమారు మూడు కిలోమీటర్లు వ్యాపించింది.
మధ్యాహ్నానికి విస్ఫోటన ప్రభావం తగ్గిపోయిందని అధికారులు వివరించారు.
లావా ఉప్పొంగి పలు పట్టణాలకు వెళ్లే వేడి నీటి పైప్​లైన్లకు ఆటంకం కలిగించింది.
దీంతో ఆ పట్టణాలకు నీటి సరఫరా నిలిచిపోయింది.
విద్యుత్​, వేడి నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని ప్రజలను కోరారు అధికారులు.
సహాయక చర్యలు చేపట్టి మరో అండర్​గ్రౌండ్​ పైప్​ లైన్​ను వేస్తున్నామని వివరించారు.
వేడి నీరు లేకపోవడం వల్ల పాఠశాలలు, జిమ్​లు, స్విమ్మింగ్​ ఫూల్​లు మూసివేశారు.
అయితే, ముందుజాగ్రత్తగా 3,800 మంది పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వల్ల ప్రమాదం తప్పింది.
గతేడాది డిసెంబర్​ 18న అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడానికి ముందే అక్కడి ప్రజలను తరలించారు.
ఐస్​ల్యాండ్​ అగ్నిపర్వత విస్ఫోటనం
ఐస్​ల్యాండ్​ అగ్నిపర్వత విస్ఫోటనం
ఐస్​ల్యాండ్​ అగ్నిపర్వత విస్ఫోటనం
ఐస్​ల్యాండ్​ అగ్నిపర్వత విస్ఫోటనం
ఐస్​ల్యాండ్​ అగ్నిపర్వత విస్ఫోటనం
ఐస్​ల్యాండ్​ అగ్నిపర్వత విస్ఫోటనం
ఐస్​ల్యాండ్​ అగ్నిపర్వత విస్ఫోటనం
ఐస్​ల్యాండ్​ అగ్నిపర్వత విస్ఫోటనం

ABOUT THE AUTHOR

...view details