ఇంకా అంతరిక్షంలోనే సునీత విలియమ్స్ - భూమికి తిరిగొచ్చిన స్టార్‌లైనర్ - Boeing Starliner Return - BOEING STARLINER RETURN
Boeing Starliner Return : బోయింగ్ చేపట్టిన తొలి అంతరిక్ష మానవసహిత ప్రయోగం అర్ధంతరంగా ముగిసింది. వ్యోమగాములను తీసుకుని అంతరిక్షంలోకి వెళ్లిన ఈ సంస్థ వ్యోమనౌకకు పలు సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో వ్యోమగాములను అక్కడే వదిలేసి ఖాళీ క్యాప్సుల్ కిందకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొన్ని నెలల పాటు సునీతా, విల్‌మోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. (Associated Press)
Published : Sep 7, 2024, 10:46 AM IST