యాగి తుపాను బీభత్సానికి 233 మంది బలి - Vietnam Death Toll - VIETNAM DEATH TOLL
Vietnam Death Toll : వియత్నాంలో యాగి తుపాను విలయాన్ని సృష్టించింది. వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మరణించిన వారి సంఖ్య 233కు చేరింది. వందలాది మంది గాయపడ్డారు. ఉత్తర లావో కై ప్రావిన్స్ లోని లాంగ్‌ను గ్రామంలో మంగళవారం మరో 48 మృతదేహాలను వెలికితీశారు రెస్క్యూ సిబ్బంది. బురదలో చిక్కుకున్నవారు, వరదల్లో కొట్టుకుపోయినవారి జాడ కోసం రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తోంది. (Associated Press)
Published : Sep 13, 2024, 1:07 PM IST