అమెరికాలోని ఫ్లోరిడాను హెలీన్ తుపాను వణికిస్తోంది. గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీరం నుంచి అమెరికా వైపు వచ్చిన తుపాను ఫ్లోరిడాను తాకే సమయంలో కేటగిరి-4 తుపానుగా మారింది.. హెలీన్ తుపాను కారణంగా గరిష్ఠంగా గంటకు 225 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచాయి.. గాలుల తీవ్రతతో ఓ స్తంభం ప్రయాణిస్తున్న కారుపై పడి ఒక వ్యక్తి మరణించినట్లు అధికారులు తెలిపారు.. దక్షిణ జార్జియాలో తుపానుకు ముందు ఏర్పడిన టోర్నడో ధాటికి మరో ఇద్దరు మృతి చెందినట్లు చెప్పారు. భారీ గాలుల కారణంగా సముద్రపు అలలు ఉవ్వెత్తున్న ఎగసిపడుతున్నాయి.. తీరం సమీపంలో ఉండే రహదారులను అధికారులు మూసివేశారు.. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లోని రహదారులు నదులను తలపిస్తున్నాయి.. హెలీన్ ధాటికి ఫ్లోరిడాలో 10 లక్షలకు పైగా. జార్జియాలో 50 వేలకు పైగా గృహాలకు. వ్యాపార సముదాయాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు ముంపు ప్రాంతాల్లోని నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.. హెలీన్ తుపాను ప్రమాదకరంగా మారడం వల్ల ఫ్లోరిడా సహా జార్జియా. నార్త్ కరోలినా రాష్ట్రాల్లో ఆకస్మిక వరదల సంభవించే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరికలను జారీ చేశారు.. వరదలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు. వరదలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు. వరదలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు. వరదలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు. వరదలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు