ఎరుపు గులాబీలు ప్రేమకు చిహ్నం. ఇవి లోతైన భావోద్వేగాలకు సంకేతం. అందుకే ప్రేమించే వారికి పువ్వు ఇవ్వాల్సి వస్తే.. అది రెడ్ రోజ్ మాత్రమే అయ్యుంటుంది. మీరు కూడా మీప్రేయసికి రెడ్ రోజ్ ఇవ్వండి.. తెల్ల గులాబీలు స్వచ్ఛమైన ప్రేమను సూచిస్తాయి. మీ ప్రేమలో కూడా స్వచ్ఛత ఉంటే.. మీ ప్రియమైన వారికి దీనిని ఇవ్వండి.. పసుపు గులాబీని స్నేహానికి చిహ్నంగా పరిగణిస్తారు. మీ ఆనందం. స్నేహాన్ని వ్యక్తీకరించడానికి ఇవి బెస్ట్ ఆప్షన్.. ఇది కేరింగ్ అండ్ లవ్‌ను సూచిస్తుంది. మీ పట్ల ఎవరైతే బాధ్యతగా. ప్రేమగా ఉన్నారో వారికి పింక్ గులాబీని ఇవ్వొచ్చు.. బ్లూ రోజ్ ఇవ్వడం చాలా అరుదు. ఈ పుష్పాన్ని మీరు ఎవరికైనా ఇస్తున్నారంటే.. ఆ వ్యక్తి మీకు ఎంతో ప్రత్యేకమైన వారని అర్థం.. ఈ గులాబీ రంగు అభిరుచికి చిహ్నం. జంటలు తమ ప్రేమలో అభిరుచిని సూచించడానికి నారింజ గులాబీలను ఇవ్వవచ్చు.. మీరు స్నేహం. ప్రేమ కలగలిసిన జీవితంలోకి ప్రవేశించాలనుకుంటే.. అప్పుడు పసుపు. ఎరుపు గులాబీలు నిండిన పుష్పగుచ్ఛాన్ని ఇవ్వవచ్చు.. ఈ గులాబీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కు సింబల్. మీరు ఎవరికైనా ఈ విషయం చెప్పాలనుకుంటే. వారికి ఒక ఊదా గులాబీని ఇవ్వండి.. రిలేషన్ ముగించడానికి లేదా ఎదుటి వారిపై అయిష్టతను వ్యక్తం చేయడానికి నల్ల గులాబీని ఇస్తారు.