వాలెంటైన్స్ వీక్లో భాగంగా ఇవాళ ప్రపోజ్ డే. ఎంతో కాలంగా మీ మనసులోనే దాచుకున్న ప్రేమను.. ఇవాళ పార్ట్నర్ ముందు ఓపెన్ చేసేయండి. ప్రేమించడం ఒకెత్తయితే.. ఆ ప్రేమను ప్రకటించడం మరొక ఎత్తు. ఈ ప్రేమ పరీక్షలో మీరు డిస్టింక్షన్లో పాస్ కావాలని ఆశిస్తూ.. ఈటీవీ భారత్ అందిస్తోంది స్పెషల్ కోట్స్.. ఇంకా గ్రీటింగ్స్ అందిస్తోంది.
నా జీవితపు ఉషోదయం నీవే.. ఉషస్సూ నీవే.. నడిరేతిరి పున్నమి వెన్నెలా నీవే..
ఆ వెలుగులు జీవితాంతం కొనసాగనిస్తావా?నువ్వు.. నా జీవితంలో మరుమల్లెవి.. నా హృదయంలో చిరుజల్లువి.. మనసంతా నిత్య మధుమాసానివి.. ఐ లవ్యూనీ జీవితంలో నిత్య సంతోషాలను నింపుతాను.. కష్టం నీ కాపౌండ్ దాటకుండా చూస్తాను.. సుఖంలో, దుఖంలో జీవితాంతం నీ పక్కనే ఉంటానని మాటిస్తున్నా నన్ను ప్రేమిస్తావా?నీ తొలి మాటతోనే నా మనసు పులకరించింది.. నీ తొలి స్పర్శతోనే నా తనువు పరవశించింది. నా జీవితాన్ని నీకు రాసిచ్చేస్తున్నా. - హ్యాపీ ప్రపోజ్ డేనీ పరిచయంతోనే నా జీవితానికి అర్థం తెలిసింది. నీతో ఏడడుగులు వేస్తేనే జన్మ ధన్యమవుతుంది. నా చేయి అందుకుంటావా?
నువ్వు కలలు కుంటూ ఉండూ.. వాటిని నేను నెరవేరుస్తూ ఉంటాను.
ప్రామిస్ చేస్తున్నా.. నీ జీవితంలో ప్రతిరోజూ ది బెస్ట్ ఇస్తా. - హ్యాపీ ప్రపోజ్ డేనువ్వు లేని నేను అసంపూర్ణం. నీ ప్రేమలేని నా జీవితం వ్యర్థం. నా భాగస్వామి కావడం ద్వారా.. నన్ను పరిపూర్ణం చేస్తావా?నిన్ను చూసే వరకు నాకూ మనసుందని తెలియదు.. నిన్ను కలిసే వరకు నేనూ ప్రేమిస్తానని తెలియదు.. ప్రేమ ఇంత అద్భుతంగా ఉంటుందని అసలే తెలియదు. - హ్యాపీ ప్రపోజ్ డేనువ్వు లేని నా జీవితం అమావాస్య చీకటే.. నీ ప్రేమ కాంతితో నా జీవితంలో నిత్యం వెలుగులు పూయిస్తావా?నువ్వు తోడుంటే జీవితంలో దేన్నైనా సాధిస్తా.. ఎవ్వరినైనా ఎదిరిస్తా..
నా చెయ్యి కలకాలం పట్టుకునే ఉంటావా?