తెలంగాణ

telangana

ETV Bharat / photos

ఐపీఎల్​లో ఫాస్టెస్ 100 సాధించిన ప్లేయర్లు ఎవరంటే ? - Fastest 100 In IPL - FASTEST 100 IN IPL

Fastest 100 In IPL : ఐపీఎల్ హిస్టరీలో ఎప్పటికీ గుర్తిండిపోయే రోజుల్లో ఏప్రిల్ 23 ఒకటి. సరిగ్గా 11 ఏళ్ల క్రితం ఇదే రోజున వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ ఓ అరుదైన రికార్డును నమోదు చేశాడు. ఆర్సీబీ తరఫున ఆడిన ఓ గేమ్​లో కేవలం 30 బంతుల్లోనే సెంచరీ అందుకుని టాప్ పొజిషన్​లో ఉన్నాడు క్రిస్ గేల్. మరి ఈ జాబితాలో ఇంకెవరెవరు ఉన్నారంటే ?

By ETV Bharat Telugu Team

Published : Apr 23, 2024, 5:26 PM IST

Fastest 100 In IPL : క్రిస్​గేల్​ నుంచి గిల్​క్రిస్ట్​ వరకు ఐపీఎల్​లో ఫాస్టెస్ 100 సాధించిన ప్లేయర్లు ఎవరంటే ?
2013 ఏప్రిల్‌ 23న పుణె వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగుళూరు బ్యాటర్‌ క్రిస్ గేల్ కేవలం 30 బంతుల్లోనే సెంచరీ అందుకుని ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆయన స్కోర్ 175.
2010 మార్చి 13న ముంబయితో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరపున బరిలోకి దిగిన యూసుఫ్ పఠాన్ కేవలం 37 బంతుల్లోనే సెంచరీ చేశాడు.
2013లో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్‌ డేవిడ్ మిల్లర్ 38 బంతుల్లోనే శతకం సాధించాడు.
2024 ఐపీఎల్‌లో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ ట్రావిస్ హెడ్ కేవలం 39 బంతుల్లోనే సెంచరీ చేశాడు.
2008లో ముంబయితో జరిగిన మ్యాచ్‌లో డెక్కన్‌ ఛార్జర్స్‌ కెప్టెన్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ కేవలం 42 బంతుల్లోనే శతకం బాదాడు.
2016లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 43 బాల్స్‌లోనే ఆర్సీబీ ప్లేయర్ మిస్టర్‌ 360 ఏబీ డివిలియర్స్‌ శతక గర్జన చేశాడు.
2017లో కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో అప్పటి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ 43 బంతుల్లో సెంచరీ చేశాడు.
2008లో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి బ్యాటర్‌ సనత్‌ జయసూర్య 45 బంతుల్లోనే వంద కొట్టాడు.
2020లో రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ బ్యాటర్‌ మయాంక్‌ అగర్వాల్‌ కూడా 45 బంతుల్లోనే సెంచరీ చేశాడు.
2010లో రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై బ్యాటర్‌ మురళీ విజయ్‌ 46 బంతుల్లోనే సెంచరీ చేశాడు.

ABOUT THE AUTHOR

...view details