దేశ రాజధాని దిల్లీలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముంగేష్‌పుర్ ప్రాంతంలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఎండలు భారీగా పెరగడం వల్ల విద్యుత్ డిమాండ్ బాగా పెరిగింది. దిల్లీ చరిత్రలోనే 8,302 మెగావాట్ల మార్కును దాటడం తొలిసారని అధికారులు తెలిపారు. ఎండల తీవ్రతతో దిల్లీలో పలుచోట్ల తాగునీటి కొరత ఏర్పడింది. నీటిని వృథా చేస్తే 2వేల రూపాయల జరిమానా విధించనున్నట్లు మంత్రి అతిశీ పేర్కొన్నారు. (Associated Press)