తెలంగాణ

telangana

ETV Bharat / photos

సిరియాలో ప్రభుత్వ ఆస్తులు లూటీ- అధ్యక్షుడి భవనంలోకి జనం- కంప్యూటర్స్‌, ఫర్నిచర్​తో పరార్ - SYRIA CRISIS 2024

Syria Crisis : సిరియా అధ్యక్షుడు అసద్‌ దేశం విడిచి పారిపోయిన నేపథ్యంలో కళ్లు చెదిరే ఆయన అద్దాల భవనంలో కొందరు దోపిడీకి పాల్పడ్డారు. చేతికి అందిన ఫర్నిచర్‌, కంప్యూటర్లను దోచుకెళ్లారు. మరికొన్ని వస్తువులను నాశనం చేశారు. సెల్ఫీలు తీసుకునేందుకు ప్రజలు.. ప్యాలెస్‌లోకి ఎగబడ్డారు. (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Dec 9, 2024, 1:25 PM IST

సిరియా అధ్యక్షుడు అసద్ పారిపోయిన తర్వాత ఆ దేశంలో ప్రభుత్వ ఆస్తులు దోపిడీకి గురయ్యాయి. (Associated Press)
డమాస్కస్‌లో కళ్లు చెదిరేలా ఉండే అసద్‌ ప్యాలెస్‌లోకి పౌరులు పెద్ద ఎత్తున చొరబడ్డారు. అసద్‌ ఆ రాజసౌధాన్నే ప్రెసిడెంట్‌ ఆఫీస్‌గా వినియోగించారు (Associated Press)
ప్యాలెస్‌ సహా దాని పరిసరాల్లోకి పోటెత్తిన కొందరు చేతికందిన కంప్యూటర్స్‌, ఫర్నిచర్‌ను ఎత్తుకెళ్లారు. (Associated Press)
రాజసౌధంలోకి భారీగా చేరుకుంటున్న రాజధాని వాసులు అక్కడ సెల్ఫీలను తీసుకుంటున్నారు. (Associated Press)
కుటుంబసభ్యులతో కలిసి ఫొటోలు దిగి ఎంజాయ్‌ చేశారు. (Associated Press)
ప్యాలెస్‌లోని కొన్ని గదుల్లో చిందరవందరగా పడేసిన కాగితాలు కనిపించాయి. దగ్ధమైన ఫర్నిచర్ దృశ్యాలు సాక్షాత్కరించాయి. (Associated Press)
విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. (Associated Press)
అసద్‌ ప్యాలెస్‌లోని గ్యారేజీలో డజన్ల కొద్దీ కళ్లు చెదిరే లగ్జరీ కార్లను రెబల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. (Associated Press)
వాటిలో మెర్సిడెజ్‌, పోర్షే, ఆడీ, ఫెర్రారీ, ఆస్టన్‌ మార్టిన్స్‌, రోల్స్‌ రాయిస్‌, బుగాటీ, బీఎండబ్ల్యూ బ్రాండ్లకు చెందిన కోట్ల విలువ చేసే కార్లు ఉన్నాయి. (Associated Press)
అసద్ ఆనవాళ్లు చెరిపే చర్యల్లో భాగంగా రెబల్స్ దేశంలో అసద్ కుటుంబీకుల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. (Associated Press)
దేశంలో ఆస్తులు లూటీ చేసేది పౌరులో లేదా రెబల్సో తెలియని పరిస్థితి నెలకొంది. (Associated Press)
అధికార మార్పిడి పూర్తయ్యే వరకు అధ్యక్ష భవనం, ప్రధానమంత్రి కార్యాలయం సహా అధికారిక భవనాల్లోకి ప్రవేశించడంపై నిషేధం ప్రకటించారు. (Associated Press)
దీంతో డమాస్కస్ లో రాత్రి సమయాల్లో తిరుగుబాటుదారుల నాయకత్వం కర్ఫ్యూ విధించింది. (Associated Press)
సెక్యూరిటీ పాయింట్లను దగ్ధం చేశారు. మీడియా కార్యాలయాల్లోకి ప్రవేశించి సిబ్బందిని నియంత్రిస్తున్నారు (Associated Press)
ప్యాలెస్‌ను అంతా గాలించిన పౌరులు అసద్‌ కుటుంబీకుల ఫొటో ఆల్బమ్‌లను తిలకించారు. వాటిలో వివిధ దేశాధినేతలతో అసద్‌ భేటీ అయిన ఫొటోలు ఉన్నాయి. (Associated Press)
అసద్‌కు చెందిన ఫొటోలను చించివేశారు. (Associated Press)
ఐక్యరాజ్యసమితికి చెందిన సిబ్బంది అంతా వారివారి నివాసాలకే పరిమితమయ్యారు (Associated Press)
ప్యాలెస్​లో చిందరవందరగా పడి ఉన్న కాగితాలు (Associated Press)
అధ్యక్షుడి నివాసంలో షాండ్లియర్​ను ఎత్తుకేళ్లేందుకు ప్రయత్నిస్తున్న యువకుడు (Associated Press)
ప్యాలెస్​లో వస్తువులు ధ్వంసం (Associated Press)

ABOUT THE AUTHOR

...view details