లాటిన్ అమెరికా దేశం చిలీలో మొదలైన కార్చిచ్చు విధ్వంసం సృష్టిస్తోంది.. అడవులతోపాటు నగరాలను చుట్టేస్తున్న అగ్నికీలలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది కష్టపడుతున్నారు.. హెలికాప్టర్లు. అగ్నిమాపక శకటాలతో మంటలను ఆర్పుతున్నారు.. అధిక ఉష్ణోగ్రతల కారణంగా చెలరేగిన మంటల్లో ఇప్పటి వరకు 112 మంది మృతిచెందారు.. తీవ్రంగా ప్రభావితమైన నగరాల్లో అధికారులు ముందు జాగ్రత్తగా కర్ఫ్యూ విధిస్తున్నారు.. వినా డెల్ మార్ చుట్టూ మంటలు బాగా వ్యాపించాయి.. 1931లో ఏర్పాటుచేసిన ప్రఖ్యాత బొటానికల్ గార్డెన్ ఆదివారం అగ్నికి ఆహుతైంది.. సుమారు 1.600 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.. నగరంలో ఇప్పటివరకు కనీసం 200 మంది గల్లంతయ్యారు.. వినా డెల్ మార్‌కు తూర్పువైపున ఉన్న ప్రాంతాల్లో కూడా మంటలు వ్యాపించాయి.. అగ్నికీలలు సమీపించిన ప్రాంతాల వారు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు చెబుతున్నారు.. దోపిడీ వంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. దాదాపు 1.100 ఇళ్లు కాలిబూడిదైనట్లు శనివారం సాయంత్రం అధికారులు ప్రకటించారు.. చిలీ కార్చిచ్చు బీభత్సం. చిలీ కార్చిచ్చు బీభత్సం. చిలీ కార్చిచ్చు బీభత్సం. చిలీ కార్చిచ్చు బీభత్సం. చిలీ కార్చిచ్చు బీభత్సం. చిలీ కార్చిచ్చు బీభత్సం. చిలీ కార్చిచ్చు బీభత్సం. చిలీ కార్చిచ్చు బీభత్సం. చిలీ కార్చిచ్చు బీభత్సం. చిలీ కార్చిచ్చు బీభత్సం