Bengaluru Water Crisis : కర్ణాటక రాజధాని బెంగళూరులో నీటి సంక్షోభం నెలకొంది.. బెంగళూరుకు రోజుకు 2600 ఎంఎల్‌డీ నీళ్లు అవసరం అవుతున్నాయని సీఎం పేర్కొన్నారు.. రోజుకు దాదాపు 500 ఎంఎల్‌డీ కొరత ఉందని సీఎం సిద్ధారామయ్య వెల్లడించారు.. కావేరి నుంచి 1470. బోరుబావులు నుంచి 650 ఎంఎల్‌డీ నీటిని తీసుకుంటున్నామని సీఎం తెలిపారు.. 'బెంగళూరులో ఉన్న మొత్తం 14 వేల బోరుబావుల్లో 6.900 ఎండిపోయాయి'. 'జూన్‌లో ప్రారంభం కానున్న 'కావేరీ ఫైవ్ ప్రాజెక్టు' ద్వారా చాలావరకు ఈ నీటి కొరత సమస్యలు తీరతాయి' సీఎం అన్నారు.. 313 చోట్ల కొత్తగా బోరు బావులు తవ్విస్తామని. మరో 1.200 పునరుద్ధరిస్తామని సీఎం తెలిపారు.. నీళ్ల సరఫరాకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌కు చెందిన ట్యాంకర్లు సహా అన్ని ప్రైవేట్ ట్యాంకర్లను ఉపయోగించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.. నీటిని వృథా చేస్తే రూ.5 వేలు జరిమానా కూడా విధిస్తామని బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ ప్రకటించింది.. దాదాపు నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ ఎరుగని రీతిలో నీటి సంక్షోభాన్ని బెంగళూరు ఎదుర్కొంటోంది.. వైట్‌ఫీల్డ్. కేఆర్ పురం. ఎలక్ట్రానిక్స్ సిటీ. ఆర్‌ఆర్ నగర్. కేంగేరీ. సీవీ రామన్ ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది.. ఈ నేపథ్యంలో నీటి వినియోగంపై అధికారు ఓ వైపు ఆంక్షలు విధిస్తూ. పొదుపు మార్గం అనుసరించాలని పౌరులకు సూచిస్తున్నారు.