తెలంగాణ

telangana

ETV Bharat / photos

బంగ్లాదేశ్‌ అల్లకల్లోలం - దేశమంతా సైన్యం మోహరింపు - ఎందుకీ దుస్థితి? - BANGLADESH PROTESTS

Bangladesh Protests : రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో బంగ్లాదేశ్‌ అల్లకల్లోలమైంది. గురువారం ఆందోళనకారులు చేపట్టిన దేశవ్యాప్త బంద్‌ హింసాత్మకమైంది. ఘర్షణల్లో 25 మంది మరణించగా, 2,500 మందికిపైగా గాయపడ్డారు. దీనితో సైన్యం రంగంలోకి దిగింది. ఫలితంగా జన జీవనం స్తంభించింది. వాణిజ్య సంస్థలు, దుకాణాలు, మార్కెట్లు, రవాణా వాహనాలు నిలిచిపోయాయి. దీనితో ఆందోళన చేస్తున్న విద్యార్థులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. అయితే విద్యార్థి సంఘాలు ఈ ఆహ్వానాన్ని తిరస్కరించాయి. (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jul 19, 2024, 9:53 AM IST

బంగ్లాదేశ్​లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇది హింసాత్మకంగా మారింది. దీనితో దేశమంతా అల్లకల్లోలం అయ్యింది. (Associated Press)
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను సంస్కరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం బంద్‌కు పిలుపునిచ్చారు. (Associated Press)
విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో విద్యా సంస్థలను ప్రభుత్వం మూసివేసింది. అయినా విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. ఈ సందర్భంగా ఘర్షణలు చోటుచేసుకున్నాయి (Associated Press)
ఆందోళనకారులు, ప్రభుత్వ అనుకూల విద్యార్థి సంఘ నేతలు ఇటుకలు, వెదురు కర్రలతో పరస్పరం ఘర్షణపడ్డారు. (Associated Press)
పరస్పరం దాడులు చేసుకుంటున్న ఆందోళనకారులు, ప్రభుత్వ అనుకూల విద్యార్థి సంఘాల నేతలు (Associated Press)
పోలీసులు కొన్నిచోట్ల ఆందోళనకారులపై రబ్బర్‌ బుల్లెట్లను ప్రయోగించారు. (Associated Press)
బంగ్లాదేశ్​లో విధ్వంసం సృష్టించిన ఆందోళనకారులు (Associated Press)
ఆందోళనకారుల దాడితో తీవ్రంగా గాయపడి, పడిపోయిన బంగ్లాదేశ్​ పోలీస్​ (Associated Press)
కర్రలు, రాడ్లు, కత్తులతో స్వైర విహారం చేస్తున్న ఆందోళనకారులు (Associated Press)
బయట ఉన్న వస్తువులకు, వాహనాలకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు (Associated Press)
ఆందోళకారులపై టియర్​ గ్యాస్​ ప్రయోగిస్తున్న సైనికులు (Associated Press)
రాళ్లదాడి నుంచి రక్షణ కోసం దాక్కున్న కొంత మంది విద్యార్థులు (Associated Press)
ప్రైవేటు వర్సిటీలు అధికంగా ఉన్న ఢాకా ఉత్తర ప్రాంతంలో ఘర్షణలు ఎక్కువగా జరిగాయి. (Associated Press)
ఆందోళనకారులను చెదరగొడుతున్న సైనికులు (Associated Press)

ABOUT THE AUTHOR

...view details