తెలంగాణ

telangana

ETV Bharat / opinion

రైతుభరోసా పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలకనిర్ణయం - వారికి మాత్రమేనట - Pratidwani Debate on Raithu Bharosa - PRATIDWANI DEBATE ON RAITHU BHAROSA

Prathidwani Debate on Raithu Bharosa : ఆరుగాలం కష్టపడే అన్నదాతకు మేలు చేయాలనే ఉద్దేశంతో రైతుభరోసా పథకానికి సంబంధించి కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. సాగుచేసే నిజమైన రైతన్నకే పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో పెట్టుబడి సాయం ఎప్పటికి ఏ రూపంలో రైతులకు అందనుంది? దీనిపై ప్రభుత్వం ఆలోచనలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని

Prathidwani Debate on Raithu Bharosa
Prathidwani Debate on Raithu Bharosa (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 26, 2024, 10:22 AM IST

Prathidwani Debate on Raithu Bharosa :రైతుభరోసా పథకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. సాగుచేసే నిజమైన రైతులకే పెట్టుబడి సాయం అందాలన్న నినాదానికి అనుగుణంగా సంస్కరణలకు సిద్ధం అయింది. ఆ దిశగానే ఇటీవలే జరిగిన రాష్ట్రమంత్రివర్గ సమావేశంలో ఇదే విషయంపై లోతుగా చర్చించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. సుదీర్ఘమథనం అనంతరం రైతుభరోసా విధివిధానాల కోసం ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క నేతృత్వంలోమంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ రైతు సంఘాలు, రైతు కూలీ సంఘాలు, ప్రతిపక్షాలతో చర్చించి జూలై 15కల్లా నివేదిక ఇవ్వాలని నిర్థేశించారు సీఎం. మరి ఈ సీజన్ పెట్టుబడి సాయం, ఎప్పటికి ఏ రూపంలో రైతులకు అందనుంది? ప్రభుత్వం ఆలోచనలు ఏమిటి? అందుకు రైతుసంఘాలు ఏమంటున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details