Pratidwani : పల్లె సీమలకు మళ్లీ మంచి రోజులు వస్తున్నాయి. గ్రామాల్లో వసతుల కల్పన, సమగ్రాభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ 23వ తేదీన ఒకటే రోజు రాష్ట్రం మొత్తం 13,326 పంచాయతీల్లో ఒకేసారి గ్రామసభల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖమంత్రి పవన్ కల్యాణ్. గ్రామాల్లో చేపట్టాల్సిన పనులపై అక్కడే చర్చించి, అక్కడే కేటాయింపులు చేసేలా అధికారులను సమాయత్తం చేస్తున్నారు. మరి, అయిదేళ్లుగా రాష్ట్రంలో పంచాయతీలు, స్థానిక సంస్థలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం చొరవ, కొత్త ప్రణాళికలతో గ్రామ స్వరాజ్యం దిశగా ఎలాంటి అడుగులు పడనున్నాయి? 100 రోజుల్లో పల్లె ప్రగతికోసం నిర్థేశించుకున్న అజెండా ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాష్ట్రంలో స్థానిక సంస్థల సమస్యలు, గత ప్రభుత్వంలో పంచాయతీలకు జరిగిన అన్యాయంపై ఎన్నో ప్రత్యక్ష పోరాటాలు చేసిన చిలకలపూడి పాపారావు. మరొకరు ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ సెంటర్ విభాగాధిపతి, గ్రామీణాభివృద్ధిరంగంలో ఎంతోకాలంగా పరిశోధనలు చేస్తున్న నిపుణులు. అస్సోం, దిల్లీ సెంట్రల్ యూనివర్సిటీల్లో కూడా పనిచేసిన విశేష అనుభవజ్ఞులు ప్రొ. శ్రీపతి రాముడు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 23 నుంచి పంచాయతీల్లో గ్రామ సభలు: పవన్ - Deputy CM Pawan Video Conference