Pratidhwani on Real Estate in AP : రియల్ ఎస్టేట్ అంటే అమ్మటం కొనటమే కాదు. దాదాపు 100కి పైగా అనుబంధ రంగాలతో ముడిపడిన వ్యాపారం అది. నిర్మాణాలు ఆగిపోతే రాష్ట్ర ఆదాయంపైనా, అభివృద్ధిపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. అదే రియల్ ఎస్టేట్ ఊపందుకుంటే? లక్షలమందికి ఉపాధి దొరుకుతుంది. ఇనుము, పెయింట్స్, రిజిస్ట్రేషన్లు, కార్పెంటర్లు, క్యాబ్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు ఇలా అందరికీ చేతినిండా పనుంటుంది.
వ్యక్తిగత, ప్రభుత్వ ఆదాయాలు పెరుగుతాయి. రాష్ట్రం ముందుకు సాగుతుంది. అది గ్రహించే స్థిరాస్తి వ్యాపార రంగానికి ఊపు తెచ్చేలా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రజలు, వ్యాపారులకు ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఐదు అంతస్తుల వరకు భవన నిర్మాణాలకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడమే తడవుగా అనుమతులు ఇచ్చేలా నిర్ణయించింది. లేఅవుట్ల అనుమతులనూ ఏపీ సర్కార్ సులభతరం చేసింది. రోడ్ల నిర్మాణ పొడవు, వెడల్పు తగ్గిస్తూ పలు వెసులుబాట్లు కల్పించింది.
మరీ అవి ఎందుకు అంత కీలకం అయ్యాయి? స్థిరాస్తి రంగం గత ఐదేళ్లలో ఎటువంటి సంక్షోభాలు చూసింది? ఆ రంగంలో ఉత్తేజం నింపటం వలన ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? రియల్ ఎస్టేట్‌రంగంలో ప్రధానమైనది అనుమతులు. ప్రభుత్వశాఖల నుంచి పర్మీషన్స్ అనేవి చాలా కీలకం. ఆ విషయంలో ప్రభుత్వం ఏం ప్రకటన చేసింది? భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతుల విషయంలో ఇంతకుముందు ఎలాంటి నిబంధనలు ఉండేవి, కొత్తగా ఏం మార్పులు చేయబోతున్నారు?
Buildings and Layout Rules Amended in AP : ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటే దాని వలన ఏఏ రంగాలకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? హైదరాబాద్ అనేది ఇప్పటికే బాగా ఎస్టాబ్లీష్ అయింది. చాలామంది అక్కడ ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్ రంగం గ్రోత్‌కు ఉన్న అవకాశాలేంటి? వాటి వల్ల ఏం మేలు జరుగుతుంది? ఇది వివరించటానికి స్థిరాస్తి రంగంలో కీలక భూమిక పోషిస్తున్న ఇద్దరు నిపుణులు క్రెడాయ్ రాష్ట్ర అధ్యక్షులు వైవీ.రమణారావు, నారెడ్కో కాపిటల్ జోన్ అధ్యక్షులు పెరవలి నాగవంశీ మనతో ఉన్నారు. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
రియల్ ఎస్టేట్ రంగానికి గుడ్‌న్యూస్ - ఇక భవన నిర్మాణాలన్నీ ఈజీ
ఇల్లు/ఫ్లాట్ కొంటున్నారా? - ముందుగా ఈ విషయాలు తెలుసుకోవడం మంచిది!