Pratidwani :ఒకటే దేశం ఒకటే ఎన్నికలు! దేశవ్యాప్తంగా పార్లమెంటు, అసెంబ్లీలకు జమిలిగా ఎన్నికలు నిర్వహించే ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. ఎన్డీయే ప్రభుత్వం 3.0లోనే అందుకు అవకాశం ఉందన్న సమాచారం జాతీయస్థాయిలో రాజకీయంగా వేడి రగిల్చింది. ఇప్పటికే జమిలీ ఎన్నికలపై ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఇచ్చి ఉండడం, ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో కూడా ప్రధానమంత్రి మోదీ దీని గురించి మాట్లాడం ఇందుకు కారణం. ఒకటైతే స్పష్టం జమిలి ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. కానీ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, మేధావివర్గంలో ఉన్న భిన్నాభిప్రాయాల మాటేంటి? ఒకే దేశం- ఒకే ఎన్నిక ఆచరణ సాధ్యం కావాలంటే జరగాల్సిన రాజ్యాంగ ప్రక్రియలు ఏంటి? ఇదే నేటి ప్రతిధ్వని. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు సీనియర్ పాత్రికేయులు చలసాని నరేంద్ర, సీనియర్ రాజకీయ విశ్లేషకులు డా. దుగ్గరాజు శ్రీనివాసరావు పాల్లొన్నారు.
'ఒకే దేశం - ఒకే ఎన్నిక' - 2026లోనే రానున్నాయా? - One Nation One Election
pratidwani : ఒకటే దేశం ఒకటే ఎన్నికలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం పలుమార్లు ప్రతిపాదన చేసింది. ఈ నేపథ్యంలో గత ఏడాది జమిలి ఎన్నికలు సాధ్యాసాధ్యలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో 8 సభ్యులతో ఒక కమిటీని నియామించింది. ప్రస్తుతం శీతాకాల సమావేశంలో పార్లమెంటులో ఈ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 19, 2024, 10:35 AM IST
జమిలి ఎన్నికలకు సంబంధించి కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘ చర్చల అనంతరం కేంద్ర మంత్రి వర్గం జమిలి ఎన్నికలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి గత ఏడాది మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఆధ్వర్యంలో కమిటీ నియామించింది. తాజాగా జరిగిన సమావేశంలో కమిటీ నివేదికపై కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జమిలి ఎన్నికలకు సుప్రీం మాజీ సీజేఐలు, హైకోర్టు న్యాయమూర్తులు సహా 32 పార్టీలు, ప్రముఖ న్యాయమూర్తుల నుంచి మద్దతు లభించింది. ఈ క్రమంలో రామ్నాథ్ కోవింద్ కమిటీ 18 రాజ్యాంగ సవరణల కోసం సిఫార్సు చేసింది. మరోవైపు జమిలి ఎన్నికలను కాంగ్రెస్ సహా 15 రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.
One Nation One Election : జమిలి అంటే పార్లమెంటుతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ ఏకకాలంలో ఎన్నికలు జరిపించాలి. ఇదేమీ భారదేశానికి కొత్తేం కాదు. 1951 నుంచి 1967 దాకా దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరిగాయి. తర్వాత వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలడం వల్ల మధ్యంతర ఎన్నికలొచ్చి జమిలి మాయమై ఆయా రాష్ట్రాల అసెంబ్లీల గడువులు మారాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వీటన్నింటినీ రానున్న సార్వత్రిక ఎన్నికలతో కలపాలంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువును పెంచడమో, మరికొన్నింటిని తగ్గించడమో చేయాలి. లోక్‌సభ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఈ మార్పులు తప్పవు. ఇందుకు రాజ్యాంగ పరంగా అవరోధాలున్నాయి.