ETV Bharat / opinion

చందమామపై మకాం! రేసులో ఇస్రో..! - PRATHIDHWANI ON RESIDENCE ON MOON

మనిషి ఊహలకు రెక్కలు తెస్తున్న అంతరిక్ష పరిశోధనలు

residence_on_moon_how_far_is_it_for_human
residence_on_moon_how_far_is_it_for_human (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 3, 2024, 1:03 PM IST

Residence on Moon How Far Is It for Human : వెన్నెల పంచే చందమామను అప్పుడప్పుడు పలకరించి రావడం కాదు! సరదాగా అక్కడికో ట్రిప్ వేసొస్తే ఎలా ఉంటుంది?! ఏం పోయి వస్తాలేం అని అక్కడికే మకాం మార్చేస్తే ఇంకెంత బావుంటుందో కదా! ఈ ఊహలకు కొత్తరెక్కలు ఇస్తున్నాయి అంతరిక్ష పరిశోధనలు. నిజానికి ఆ చల్లనిరేడుపై మనిషి అడుగు పెట్టి చాన్నాళ్లే అయింది. కానీ పట్టుమని కాసేపు, కొన్నిరోజులు అక్కడ ఉండలేక పోయారే అన్న నిట్టూర్పు మాత్రం వెంటాడుతునే ఉంది.

ఆ లోటును భర్తీ చేసేందుకు, చందమామను శాశ్వత ఆవాసంగా మార్చుకునేందుకే ఇప్పుడు ఎన్నో ప్రయత్నాలు జరుగుతునే ఉన్నాయి. అమెరికా అంతరిక్ష పరిశో ధనా సంస్థ- నాసా ఆ విషయంలో చాలా విషయాలు చెబుతోంది. ఇప్పుడు ఆ రేసులో మేమూ రెడీ అంటోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. మరి చందమామపై నివాసాలకు మనిషి ఎంతదూరంలో ఉన్నాడు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు ఇస్రో విశ్రాంత అసోసియేట్ డైరెక్టర్​ డా. వి. శేషగిరిరావు, అంతరిక్ష వ్యవహారాల నిపుణులు బైరిశెట్టి మల్లికార్జునరావు

ఎంతోకాలంగా ఊహలకే పరిమితం అనుకున్న చందమామపై ఆవాసాల ఆలోచనలు వాస్తవ రూపం దాల్చనున్నాయా? చంద్రుడిపై ఆవాసాలకు మనిషి ఎంతదూరంలో ఉన్నాడు? అసలు చందమామపై మనిషి మనగలడా? సాంకేతికాంశాలు కాసేపు అలా ఉంచితే జీవం ఉనికికి కావాల్సిన వాతావరణం, పరిస్థితులు అక్కడ సాధ్యమేనా? చందమామ, అంగారకుడు వంటి గమస్యస్థానాలకు వ్యోమగాములను పంపడానికి లద్దాఖ్‌లో ఇస్రో ఏర్పాటు చేస్తామంటున్న అనలాగ్ స్పేస్ మిషన్ ప్రత్యేకత ఏమిటి?

జూపిటర్‌ చంద్రుడిపై జీవం ఉందా..?- నిగూఢ రహస్యాలు ఛేదించేందుకు రంగంలోకి 'యూరోపా క్లిప్పర్'

వనరులు, ప్రయోజనాలపరంగా చూస్తే చంద్రుడిని చేరుకోవడం, అక్కడ నివాసం ఉండడం వలన మానవాళికి అసలు ఏమిటి మేలు దూరాభారం దాటి ఒకవేళ చంద్రుడిపై మనిషి నివాసం నిశ్చయమే అయితే అక్కడ జీవితం ఎలా ఉంటుంది? ఒకఊహకే అయినా అక్కడ నివాసం, రోజువారి జీవితం ఎలా ఉంటుంది? చంద్రుడిపై ఒక ప్లాట్ కొందాం ఒక కాలనీ కట్టుకుందాం ఇలాంటి మాటలు చాలా వింటున్నా .

అక్కడ అమ్మేదెవరు? కొనేదెలా? ఇదంతా ఎవరి పర్యవేక్షణలో ఉంటుంది? హద్దులు ఎలా? అది నాసా కావొచ్చు మన ఇస్రో ద్వారా కావొచ్చు అన్నీ అనుకూలిస్తే మనిషి చంద్రుడిపై షికార్లు, పిక్నిక్‌లు, మకాంలు చేయడానికి ఇంకా ఎంత సమయం పట్టొచ్చు? ఆర్థిక కోణంలో చూస్తే ఈ యాత్రలు, నివాసాలు, కాలనీలకు ఎంత ఖర్చు అవుతుంది? అక్కడ మనిషి ఉండడానికి, తినడానికి, వీటన్నింటికీ ఎంతెంత వెచ్చించాల్సి ఉంటుంది? వంటి అంశాలపై పూర్తి సమాచారం నేటి ప్రతిధ్వని కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం.

ప్లూటో జాబిల్లిపై కార్బన్‌ డయాక్సైడ్‌ గుర్తించిన శాస్త్రవేత్తలు - Dwarf Planet Pluto

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.