One Nation – One Election Obstacles to Overcome : దేశ రాజకీయ ముఖచిత్రం మార్చే జమిలి ఎన్నికల వైపే కేంద్రం అడుగులు పడుతున్నాయా? గతనెలలో కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందిన ఒకే దేశం - ఒకే ఎన్నికల ప్రతిపాదనలకు వాస్తవ రూపం ఇచ్చే కసరత్తు వడివడిగా జరుగుతోందా? మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నివేదికకు కేంద్రం ఆమోదం నుంచి మొదలైన ఈ అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి.
పైకి ఎక్కడా అలికిడి లేకున్నా మరికొన్ని రోజుల్లో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఇందుకు సంబంధించిన బిల్లు కూడా ప్రవేశపెట్టబోతున్నారన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఎలాంటి మార్పులు అనివార్యం? వాటితో ఎవరికి మోదం? ఎవరికి ఖేదం? జమిలి బాటలో ఎన్డీయే ప్రభుత్వం అధిగమించాల్సిన సవాళ్లు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు డా. అందె సత్యం, మరొకరు రాజకీయ, వర్తమాన అంశాల విశ్లేషకురాలు బాలలత.
'ఒకే దేశం-ఒకే ఎన్నిక' అంశంపై మరీ ముఖ్యంగా నెల రోజులుగా నెలకొన్న పరిణామాలను ఎలా చూడొచ్చు? జాతీయస్థాయిలో దీనిపై ఎలాంటి చర్చ జరుగుతోంది? బీజేపీ ఈ విషయంలో ఎక్కడా దాపరికంగా లేదు. మానిఫెస్టోలో పెట్టింది. క్యాబినెట్ ఆమోదం పొందింది. అందుకే తప్పక చేసి తీరుతుందని చాలామంది అంచనా. దీనిపై మీ పరిశీలన ఏమిటి? ఎన్నికల ఖర్చు పరంగా ఆదా అవుతుంది సరే లోక్‌సభకూ, అన్ని రాష్ట్రాల శాసనసభలకూ కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంలో సాధ్యాసాధ్యాలు, సవాళ్లు ఏమిటి? జమిలి ఎన్నికలకు 2 రాజ్యాంగ సవరణ బిల్లులు, 6 అధికరణల్లో మార్పు అవసరం అని చాలా మంది మాట. అవన్నీ సాధ్యమేనా? అసెంబ్లీల గడువు పెంపు, తగ్గింపు ఇవన్నీ చేయగలరా?
'ఒకే దేశం - ఒకే ఎన్నిక' - 2026లోనే రానున్నాయా? - One Nation One Election
జమిలి ఎన్నికలు వస్తే కేంద్రంలో అధికార పార్టీనే రాష్ట్రాల్లోనూ పట్టు సాధిస్తుందన్న వాదనలు బలంగా ఉన్నాయి. వాటికి పరిష్కారం చూపిస్తారా? అది జరగకుండా జమిలి సాధ్యమేనా? ఈ నవంబర్ 26తో భారత రాజ్యాంగానికి వజ్రోత్సవ సందర్భం ప్రారంభం కానుంది. ఆ ముందు లేదా వెనకనే జమిలి బిల్లు రావొచ్చని కొందరి అంచనా. మీ పరిశీలన ఏమిటి? ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వమే పూర్తి ఆధిక్యంతో లేదు. ఈ పరిస్థితుల్లో బిల్లులు తెస్తే ఎలా నెగ్గించుకోగలరు? వారిమిత్రపక్షాలన్నీ అయినా దీనిపై ఏకాభిప్రాయంతోనే ఉన్నాయా? మీ అంచనా ప్రకారం జమిలి ఎన్నికల విషయంలో ఏం జరిగే అవకాశం ఉంది? ఎంతవరకు అది ముందుకు వెళ్లొచ్చు? దీని లాజికల్ ఎండింగ్ ఎలా ఉండొచ్చని మీ అంచనా?