రైతుల ఎదురుచూపులకు తెర - తెలంగాణలో రుణమాఫీ పండుగ - Debate on Crop Loan Waiver in TG
Crop Loan Waiver In Telangana : తెలంగాణలో ఎట్టకేలకు రైతు రుణమాఫీ ఎదురుచూపులకు తెరపడింది. హామీ ఇచ్చిన విధంగానే రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసింది. అయితే అర్హులైన రైతులు తమ రుణ మాఫీ వివరాలను ఎలా తెలుసుకోవాలి? పూర్తి ప్రక్రియ గురించి ప్రతిధ్వనిలో తెలుసుకుందాం.
Published : Jul 19, 2024, 10:34 AM IST
Debate on Crop Loan Waiver In Telangana :రైతు రుణమాఫీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. తొలిరోజు లక్ష రూపాయల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిధులు విడుదల చేశారు. మూడు విడతల్లో రెండు లక్షల రూపాయల వరకు రుణాలు మాఫీ చేయనున్నారు. ఈ సందర్భంగా రేషన్‌కార్డు నిబంధనపై రైతుల్లో నెలకొన్న గందరగోళానికి ముఖ్యమంత్రి ముగింపు పలికారు. పట్టాదారు పాస్‌బుక్ ఆధారంగానే అర్హులైన రైతులను గుర్తిస్తారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తొలిరోజు రుణమాఫీ ప్రక్రియ ఎలా జరిగింది? అర్హులైన రైతులు తమ రుణాల మాఫీ వివరాలను ఎలా తెలుసుకోవాలి? మొత్తం ప్రక్రియ పూర్తయ్యే వరకు రైతులు, బ్యాంకర్లు, అధికారుల మధ్య ఎలాంటి సమన్వయం అవసరం? అన్న అంశాలను ప్రతిధ్వనిలో తెలుసుకుందాం