Mobile Phone Effect on Human Body Pratidhwani : సెల్‌ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచం అవతలివైపు ఉన్న వారితోనైనా మాట్లాడవచ్చు. ఒకరినొకరు చూసుకోవచ్చు. వందల పేజీల పుస్తకాలు చదవొచ్చు. సినిమాలు చూడొచ్చు. వీడియోలు పంపుకోవచ్చు. ఇన్ని రకాల పనులు చిటికెలో చేసిపెడుతున్న సెల్‌ఫోన్ మనిషి మస్తిష్కాన్ని మాత్రం మాయం చేస్తోంది. అరచేతిలో ప్రపంచాన్ని ప్రత్యక్షం చేస్తున్న స్మార్ట్‌ఫోన్ మనిషి కదలికల్ని కట్టిపడేస్తోంది. ఆలోచనల ప్రవాహాలపై ఆనకట్టలు నిర్మిస్తోంది.
మానవుడి జీవనానికి శాపంగా సెల్‌ఫోన్ - మరి సెలవిచ్చేద్దామా? - mobile hazards on human pratidhwani - MOBILE HAZARDS ON HUMAN PRATIDHWANI
Mobile Hazards on Human Body : ప్రస్తుత ఆధునిక కాలంలో మొబైల్ ఫోన్ మానవుడి జీవితంలో ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. అయితే ఆ సెల్‌ఫోనే మనుషుల ప్రాణాలు కూడా తీస్తోంది. మానవుడి శరీరానికి సెల్‌ఫోన్ ఏవిధంగా హాని చేస్తుందో తెలుసా?
Mobile Hazards on Human Body (ETV Bharat)
Published : Jul 28, 2024, 12:28 PM IST
వాట్సాప్‌లో ఎడతెగని చాటింగ్, ఫేస్బుక్ కామెంట్లు, యూట్యూబ్ రీల్స్, ఎక్స్ వేదికగా ట్వీట్ పోస్టింగ్‌లు స్మార్ట్‌ఫోన్ యూజర్ల అలవాట్లను ఏ మార్చుతున్నాయి. ఈ పరిస్థితుల్లో గంటల తరబడి సెల్‌ఫోన్ తెరల వైపు కళ్లప్పగించి చూస్తే ఏమవుతుంది? స్మార్ట్‌ఫోన్ అడిక్షన్తో మానవ సంబంధాలకు ఎలాంటి విఘాతం కలుగుతోంది? ఈ డిజిటల్ ఉత్పాతం నుంచి ఎలా బయటపడాలి? ప్రతిధ్వనిలో చూద్దాం.