Pratidhwani :ప్రపంచ క్రీడల మహావేదిక ఒలింపిక్స్. అసాధారణ ప్రతిభ, గగుర్పొడిచే క్రీడా విన్యాసాలతో పతకాలు ఒడిసి పట్టాలని ఎందరో కలలుకనే క్రీడా సంరంభమిది. కోట్లాది మంది క్రీడాభిమానులు ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తున్న ఈ క్రీడా సమరంలో ఈ సారి భారత్ కూడా ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. భారత్ ఒలింపిక్స్ మైదానంలోకి అడుగుపెట్టి వందేళ్లు పూర్తి చేసుకున్న తర్వాత జరుగుతున్న ఈ తొలి క్రీడా సంగ్రామం మన దేశానికి చాలా ప్రత్యేకం. ఇలాంటి విశిష్ట సందర్భంలో భారత అథ్లెట్ల ప్రదర్శనపై ఉన్న అంచనాలేంటి? బాక్సింగ్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, జావెలిన్ త్రో వంటి క్రీడల్లో హాట్ ఫేవరెట్లు ఎవరు? ఒలింపిక్స్‌లో రెండంకెల పతకాలు సాధించాలన్న లక్ష్యం దిశగా భారత్ ఎలాంటి అడుగులు వేస్తోంది. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మనతో చర్చలో పాల్గొంటున్నవారు జూనియర్ ఇండియా అథ్లెటిక్స్ నేషనల్ ఛీఫ్ కోచ్, ద్రోణాచార్య పురస్కార గ్రహీత నాగపురి రమేశ్, సాప్ మాజీ ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి పి. అంకమ్మ చౌదరి.
ఒలింపిక్స్ 2024లో పాల్గొనబోతున్న భారత క్రీడా బృందాలపై చాలా అంచనాలున్నాయి. మొత్తం కంటింజెంట్‌పై దేశం పెట్టుకున్న ఆకాంక్షలు ఏమిటి? బాక్సింగ్, రెజ్లింగ్, జావెలిన్ త్రో వంటి క్రీడల్లో మన అథ్లెట్లు టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు. ఇలా ఇంకా ఏఏ విభాగాల్లో టైటిల్‌పై ఆశలున్నాయి? ఈ సారి ఒలింపిక్స్‌లో తెలుగురాష్ట్రాల నుంచి ఏఏ క్రీడల్లో తెలుగువారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు? వారిలో ఆశాకిరణాలుగా ఉన్న వారు ఎవరు?