ప్రక్షాళన దిశగా పాఠశాల విద్య - బడుల్లో జరగాల్సిన సంస్కరణలేంటి? - TG School Education on Revamp
Telangana School Education On Revamp : ఎన్నో ఏళ్లుగా ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతోంది. గతంలో కొన్ని న్యాయపరమైన చిక్కులు ఎదురైన దృష్ట్యా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కట్టుదిట్టంగా నిర్వహించింది. అయితే ప్రభుత్వ బడుల్లో స్టూడెంట్-టీచర్ నిష్పత్తి ఎలా ఉంది? 7వేలకు పైగా ఏకోపాధ్యాయ పాఠశాలల్ని కొనసాగిస్తారా? కేంద్ర విద్యాశాఖ పాఠశాలల గ్రేడింగ్‌లో మన పాఠశాలలు ఎక్కడున్నాయి? పై విషయాలన్నింటిపై నేటి ప్రతిధ్వని.
Published : Jul 9, 2024, 10:23 AM IST
Telangana School Education On Revamp : ఏళ్ల తరబడి ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్న పదోన్నతులు, బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. అనేక అవాంతరాలు దాటి ముందుకుసాగుతోంది. గతంలో కోర్టు కేసులతో అర్ధంతరంగా బదిలీల ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే ఈ సారి ప్రభుత్వం బదిలీల ప్రక్రియను కట్టుదిట్టంగా నిర్వహించింది. అయితే పాఠశాలల్లో విద్యార్థులు-ఉపాధ్యాయుల నిష్పత్తి ఎలా ఉంది? విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల కేటాయింపులు జరగుతున్నాయి. జీఓ 317 బాధిత ఉపాధ్యాయులకు లభించిన ఊరట? డీఎస్సీ నియామక ప్రక్రియ ఎప్పట్లోగా పూర్తవుతుంది? ప్రతీ పంచాయతీకి ఒక పాఠశాల ఉండాల్సిందేనన్న సీఎం ఇంతకు ముందే తెలిపారు. 7వేలకు పైగా ఏకోపాధ్యాయ పాఠశాలల్ని కొనసాగిస్తారా! విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు సరిగాలేవన్న విమర్శలు వస్తున్నాయి. కేంద్ర విద్యాశాఖ పాఠశాలల గ్రేడింగ్‌లో మన రాష్ట్రం ఎక్కడ? ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న టెక్నాలజీ ఆధారిత బోధన ఆ దిశగా సర్కారు బడుల్లో జరగాల్సిన సంస్కరణలేమిటి? ఈ అంశాలన్నింటిపై నేటి ప్రతిధ్వని కార్యక్రమం.