Prathidwani Debate On Seeds Prices : పంటల సాగులో విత్తనాలదే ప్రథమ ప్రాధాన్యం. విత్తన భాండాగారంగా పేరొందిన ఈ రాష్ట్రంలో ఆహారపంటలు, వాణిజ్య పంటల కోసం ఏటా లక్షల క్వింటాళ్ల విత్తనోత్పత్తి జరుగుతోంది. ఈ మేరకు వరి, పత్తి, మిరపతోపాటు పప్పులు, నూనెగింజల విత్తనాల ఉత్పత్తిలో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తోంది. అయితే స్థానికంగా రైతులు విత్తనాలు కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో విత్తనాల ధరలకు రెక్కలొస్తున్నాయి.
పంటలసాగులో విత్తనాలదే ప్రథమ ప్రాధాన్యం - కానీ రైతులకు మోయలేని భారంగా మారిన విత్తన ధరలు - Prathidwani On seeds production - PRATHIDWANI ON SEEDS PRODUCTION
Prathidwani Debate On Seeds Prices : రైతులు పండించే ఏ పంటకైనా ఆశించిన దిగుబడి రావాలంటే విత్తన ఎంపిక అనేది అతి ముఖ్యమైన దశ. అయితే విత్తన భాండాగారంగా పేరొందిన రాష్ట్రంలో ఏటా లక్షల క్వింటాళ్ల విత్తనోత్పత్తి చేస్తున్నారు. మరి కొన్ని కంపెనీల విత్తనాలకు మాత్రమే ఎందుకు ఎక్కువగా డిమాండ్ ఉంది? తదితర అంశాలపై ప్రతిధ్వని
Prathidwani Debate On seeds production
Published : Apr 3, 2024, 11:12 AM IST
మార్కెట్లో కొన్ని కంపెనీల విత్తనాలకు అసాధారణ డిమాండ్ ఏర్పడుతోంది. దీంతో బ్లాక్ మార్కెటింగ్, నకిలీ విత్తనాల మాఫియా చేతుల్లో అన్నదాతలు మోసపోతున్నారు. పెరుగుతున్న విత‌్తన ధరలు మోయలేని భారంగా మారుతున్నాయి. అసలు విత్తన ధరల నిర్ణయం ఎలా జరుగుతోంది? కొన్ని కంపెనీల విత్తనాలకే అధిక డిమాండ్ ఎందుకు ఏర్పడుతోంది? రాష్ట్రంలో అమలవుతున్న విత్తన ఉత్పత్తి, నాణ్యత, ధరల విధానం ఏమిటి? ఇదే నేటి ప్రతిధ్వని.