తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : May 30, 2024, 9:41 AM IST

ETV Bharat / opinion

రహదారుల రక్త దాహం తీరేదెలా - ప్రభుత్వం, పౌర సమాజం ముందు ఉన్న సవాళ్లేంటి? - PRATHIDWANI ON CAUSES OF ACCIDENTS

Road Accidents In India : ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న రహదారి మరణాల్లో 11 శాతం భారత దేశం నుంచే ఉండటం గమనార్హం.రోడ్డు ప్రమాదాల్లో ఏటా లక్షన్నర మందికి పైగా కబళిస్తున్నాయి. 50లక్షల మందికి పైగానే వికలాంగులు అవుతున్నారు. మరి ఇంతటి స్థాయిలో ఆందోళన కలిగిస్తోన్న రహదారి ప్రమాదాలకు ప్రధాన కారణాలు ఏమిటి? ప్రభుత్వం, పౌర సమాజం ముందు ఈ విషయంలో ఉన్న సవాళ్లేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

Prathidwani Debate On Road Accidents
Road Accidents In Telangana (Etv Bharat)

Prathidwani Debate On Road Accidents: దేశంలో ఏటా లక్షన్నర మందికి పైగా కబళిస్తున్నాయి రోడ్డు ప్రమాదాలు. 50లక్షల మందికి పైగానే వికలాంగులు అవుతున్నారు. వీరి కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర కష్టాల పాలవుతున్నాయి. నిత్యం సగటున 462మంది, ప్రతి 3నిమిషాలకు ఒకరు మృత్యువాత పడుతున్న పరిస్థితుల్లో రహదారులపై రక్తపుచారికల తడి ఆరడం లేదు. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న రహదారి మరణాల్లో 11 శాతం భారత దేశం నుంచే ఉండటం గమనార్హం.

అతివేగం, సీట్‌ బెల్ట్‌, హెల్మెట్ ధారణ వంటి చిన్న చిన్న జాగ్రత్తల్లో అలసత్వంతోనే పెనుముప్పు ముంచెత్తుతుంది. దేశం మొత్తం ఇదే సమస్యతో సతమతమవుతోంది. దేశ జీడీపీలో 3.14 శాతం వరకు నష్టానికి కారణం రహదారుల ప్రమాదాలే. మరి ఇంతటి స్థాయిలో ఆందోళన కలిగిస్తోన్న రహదారి ప్రమాదాలకు ప్రధాన కారణాలు ఏమిటి? ప్రభుత్వం, పౌర సమాజం ముందు ఈ విషయంలో ఉన్న సవాళ్లేంటి? ఏటా వేలాది కుటుంబాల్లో విషాదం నింపుతున్న ఈ రోడ్డు టెర్రర్‌కు అడ్డుకట్ట వేసేదెలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details