Prathidwani: భగవంతుడికి - భక్తుడికి అనుసంధానం అర్చకుడు. అలాంటి బ్రాహ్మణుల జీవితాలను మార్చేస్తానని, వెలుగులు నింపుతానని ప్రతిపక్షనేతగా వాగ్దానం చేశారు జగన్మోహన్‌రెడ్డి. ఐదేళ్ల పాలన పూర్తవుతోంది. బ్రాహ్మణుల ముఖాల్లో సంతోషం నిండిందా? ఆలయాల్లోనే అర్చకులను అధికారపార్టీ నేతలు కొడుతుంటే, తిడుతుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారు? బ్రాహ్మణులకు ఆర్థికంగా ఆసరాగా ఉండేందుకు టీడీపీ ప్రభుత్వం తెచ్చిన బ్రాహ్మణ కార్పొరేషన్‌కు జగన్ జమానాలో ఏ గతి పట్టింది? బ్రాహ్మణులకు ప్రత్యేక సాయం ఏదైనా అందుతోందా? ఆలయాన్ని, దైవాన్ని నమ్ముకున్న బ్రాహ్మణులు ఈ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి ఉందా? ఇదీ నేటి ప్రతిధ్వని కార్యక్రమం. దీనిపై చర్చించేందుకు ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతిస్వామి, బ్రాహ్మణ సంఘం నాయకులు నందిరాజు ప్రకాష్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వర్సిటీలతో రాజకీయం - వైసీపీ కార్యాలయాల్లా విశ్వవిద్యాలయాలు - Universities as Centers of Politics
"దేవుడికి మనిషికి మధ్య వారధిగా ఉండేవారు బ్రాహ్మణులు. వీరి పరిస్థితి దయనీయంగా ఉంది. పేదరికంలో అల్లాడుతున్నారు. బ్రాహ్మణుల అందరి ముఖంలో సంతోషం, చిరునవ్వుని చూసేలా కార్యక్రమాలు అమలు చేస్తాను" - ఇవి 2018, సెస్టెంబరులో విశాఖపట్నంలో బ్రాహ్మణులతో నిర్వహించిన ఆత్మీయసమ్మేళనంలో ప్రతిపక్షనేతగా జగన్ చేసిన వ్యాఖ్యలు. ఇలా బ్రాహ్మణుల ముఖంలో చిరునవ్వు చూస్తానని చెప్పిన జగన్, సీఎం కాగానే వారికి అమలవుతున్న పథకాలను అర్ధాంతరంగా ఆపేసి కుమిలిపోయేలా చేశారు. వారి జీవితాలకు వెలుగు నింపేందుకు దోహదపడే ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌ను చంపేసి, దాన్ని దిష్టిబొమ్మలా మార్చేశారు. గతంకంటే కార్పొరేషన్‌కు దండిగా నిధులిస్తున్నట్లు చూపిస్తూ, వాటిని వెనువెంటనే నవరత్నాల పథకాల కోసం మళ్లించేస్తున్నారు.
అంటే కుడిచేత్తో నిధులిచ్చి, ఎడమచేత్తో లాగేసుకుంటున్నారు. బ్రాహ్మణులు అధికంగా ఉండే ఉత్తరప్రదేశ్‌సహా దేశంలో మరెక్కడా లేనివిధంగా ఏపీలో తొలిసారిగా బ్రాహ్మణ కార్పొరేషన్‌ను గత ప్రభుత్వం 2014లో ఏర్పాటుచేసి, వినూత్న పథకాల అమలుతో రోల్ మోడల్‌గా నిలపగా, దీన్ని జగన్ సర్కారు పూర్తిగా నిర్వీర్యం చేసేంది. అసలు ఇప్పుడీ కార్పొరేషన్ ఉందనే విషయాన్ని కూడా బ్రాహ్మణులు మరచిపోయే దుస్థితిని తీసుకొచ్చారు. అన్ని వర్గాలకు మేలు చేశామంటూ ఊకదంపుడు ప్రసంగాలతో నిత్యం గొప్పలుచెప్పే సీఎం జగన్ బ్రాహ్మణులకు తీరని అన్యాయం చేశారు.
అర్చకులపై దాడులు: ఈ ఏడాది మార్చి నెలలో సాక్షాత్తూ శివాలయంలోనే అర్చకులపై వైసీపీ నేత దౌర్జన్యానికి దిగారు. గుడిలోనే అర్చకులను కాలితో తన్ని, దవడపై కొట్టారు. అసభ్యపదజాలంతో దూషించారు. అభిషేకం సరిగా చేయలేదని గుడిలో బూతుపురాణం అందుకున్నారు. కాకినాడలోని పురాతన శివాలయంలో భక్తుల సమక్షంలోనే దారుణానికి పాల్పడ్డారు.