ETV Bharat / state

చంద్రబాబు కేసులను సీబీఐకి బదిలీ చేయాలన్న పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు - SC ON CHANDRABABU CBI CASES

ఒక్క మాట కూడా మాట్లాడవద్దంటూ సీనియర్​ న్యాయవాదిపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం - పనికి మాలిన పిటిషన్‌ అంటూ డిస్మిస్‌ చేసిన ధర్మాసనం

SC on Cases Against Chandrababu
SC on Cases Against Chandrababu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 28, 2025, 12:51 PM IST

Updated : Jan 28, 2025, 1:32 PM IST

SC on Chandrababu CBI Cases : ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏడు కేసులు సీబీఐకి బదిలీ చేయాలంటూ హైకోర్టు న్యాయవాది బి.బాలయ్య ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఇది పూర్తిస్థాయిలో తప్పుడు పిటిషన్‌ అని జస్టిస్‌ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.

పిటిషన్‌కు సంబంధించి ఒక్క మాట మాట్లాడినా భారీగా జరిమానా విధిస్తామని జస్టిస్‌ బేలా త్రివేది హెచ్చరించారు. బాలయ్య తరఫున వాదనలు వినిపించడానికి సీనియర్‌ న్యాయవాది మణీందర్‌ సింగ్‌ సిద్ధమయ్యారు ఇలాంటి పిటిషన్లను కూడా మీరు వాదిస్తారా అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసుల్లో కూడా మీలాంటి సీనియర్లు హాజరవుతారని అసలు ఊహించలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఒక్క మాట కూడా మాట్లాడొద్దంటూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్‌ చేసింది.

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ - ధర్మాసనం భిన్నాభిప్రాయాలతో సీజేఐ ముందుకు

Last Updated : Jan 28, 2025, 1:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.