ETV Bharat / offbeat

"వంకాయ పల్లీ కారం" - ఇలా చేశారంటే రుచి అస్సలు మర్చిపోలేరు! - VANKAYA PALLI KARAM

కూరగాయల్లో రారాజు వంకాయ - పల్లీ కారంతో ఇలా ట్రై చేయండి!

How to Make Vankaya Palli Karam
How to Make Vankaya Palli Karam (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 28, 2025, 12:58 PM IST

How to Make Vankaya Palli Karam : ఊదా, తెలుపు రంగులో పొందిగ్గా ఉండే వంకాయలతో ఇగురు, పులుసు, మసాలా కూర ఇలా ఏం చేసినా అదిరిపోతుంది. ఇక కాస్త మసాలాల పట్టించి వండిన గుత్తొంకాయ కూర అయితే, ఇంట్లో వాళ్లు ఆ రోజు పండగ చేసుకోవాల్సిందే! త్వరగా మగ్గిపోయి, కూర రుచిగా ఉండడంతో వంకాయ కర్రీ అంటే అందరూ ఇష్టపడతారు. అందుకే వంకాయను కూరల్లో రారాజుగా చెబుతారు. వంకాయ గొప్పతనాన్ని తెలియజేస్తూ ఓ పాట కూడా ఉంది, 'తాజా కూరల్లో రాజా ఎవరండీ? ఇంకా చెప్పాలా - వంకాయేనండీ' అని. అయితే, వంకాయతో ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా వంకాయ పల్లీ కారం ట్రై చేయండి. ఈ రెసిపీ వేడివేడి అన్నంలోకి రుచి అద్దిరిపోతుంది. పైగా దీన్ని సింపుల్​గా నిమిషాల్లోనే చేసుకోవచ్చు. మరి వంకాయ పల్లీ కారం తయారీ విధానం ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • వంకాయలు అర కేజీ
  • జీలకర్ర - టీ స్పూను
  • ఆవాలు - టీ స్పూను
  • నూనె - 3 స్పూన్లు
  • ఉల్లిపాయలు - 2
  • పచ్చిమిర్చి - 3
  • కరివేపాకు - 2 రెబ్బలు
  • ఎండుమిర్చి - 2
  • పల్లీలు - పావు కప్పు
  • పుట్నాలు - పావు కప్పు
  • నువ్వులు - 2 టేబుల్​స్పూన్లు
  • వెల్లుల్లి రెబ్బలు - 4
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - 2 టీస్పూన్లు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పసుపు - పావు టీ స్పూను
  • కారం - సరిపడా
  • గరం మసాలా - టీస్పూన్​
  • కొత్తిమీర తరుగు - గుప్పెడు

తయారీ విధానం :

  • ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్​ చేసుకోండి. ఆపై వాటిని ఉప్పు నీటిలో వేయండి. ఇలా కట్​ చేసిన వంకాయ ముక్కలను ఉప్పు నీటిలో నానబెట్టడం వల్ల అవి రంగు మారకుండా ఉంటాయి.
  • ఇప్పుడు స్టౌపై పాన్​ పెట్టండి. ఇందులో పల్లీలు వేసి దోరగా వేయించుకోండి. ఆపై ఎండుమిర్చి, పుట్నాలు, వెల్లుల్లి రెబ్బలు, నువ్వులు ఒక్కోటి వేసి కాసేపు ఫ్రై చేయండి.
  • తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి. ఆపై మిక్సీ గిన్నెలో వేసుకుని కాస్త బరకగా పొడి చేసుకోండి.
  • ఇప్పుడు అదే పాన్​లో నూనె వేసి వేడి చేయండి. వేడివేడి నూనెలో ఆవాలు, జీలకర్ర వేసి వేపండి. ఆపై ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి కాసేపు వేపండి. తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్​ వేసి వేపండి.
  • ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్​ కలర్లో మారిన తర్వాత వంకాయ ముక్కలు వేసి కలపండి. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసి మూతపెట్టి మధ్యమధ్యలో కలుపుతూ మగ్గించుకోండి.
  • వంకాయలు మెత్తగా ఉడికిన తర్వాత ముందుగా గ్రైండ్​ చేసుకున్న పల్లీల పొడి, రుచికి సరిపడా కారం, గరం మసాలా వేసి కలుపుకోండి.
  • ఒక రెండు నిమిషాల తర్వాత కాస్త కొత్తిమీర తరుగు చల్లి స్టవ్​ ఆఫ్ చేయండి. అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే రుచికరమైన వంకాయ పల్లీ కారం మీ ముందుంటుంది!
  • ఈ వంకాయ పల్లీ కారం నచ్చితే మీరు ఓ సారి ట్రై చేయండి.

పాతకాలపు 'ఉప్మా' తయారీ విధానం - ఇలా చేస్తే మీకు 100 మార్కులు గ్యారెంటీ!

ఎన్ని వెరైటీలున్నా కరివేపాకు చికెన్ క్రేజ్ వేరే! - సింపుల్ టిప్స్​తో సూపర్ టేస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.