ETV Bharat / state

వ్యవసాయ సహకార పరపతి సంఘం కుంభకోణం- రూ.104 కోట్లకు పైగా నిధుల దుర్వినియోగం - 104 CRORE RUPEES SCAM IN PACS

నిందితులపై చర్యలు ఇంకెప్పుడని రైతుల నిలదీత- బాధ్యులపై సివిల్‌, క్రిమినల్ చర్యలు ఉంటాయన్న అధికారులు

104_crore_rupees_scam
104_crore_rupees_scam (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 28, 2025, 1:02 PM IST

104 Crore Rupees Scam Primary Agricultural Cooperative Credit Society (PACS) in Kirlampudi : కాకినాడ జిల్లా కిర్లంపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో 104 కోట్ల రూపాయల కుంభకోణం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. విచారణకే 18 నెలలు సాగదీస్తే నిందితులపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారని అధికారులను నిలదీశారు.

కిర్లంపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో జరిగిన 104 కోట్ల రూపాయల కుంభకోణంపై చర్చించడానికి మహాజన సభ నిర్వహించారు. సొసైటీ సీఈవో వెంకటరమణ నివేదిక వివరాలను చదివి వినిపించారు. ఎవరెవరు ఎంత మొత్తంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారో పేర్లతో సహా వెల్లడించారు.

సొసైటీలో రూ. 90 కోట్ల రుణాలు తీసుకున్నట్లు రికార్డుల్లో చూపించారని ప్రకటించారు. అందులో 13 వందల 11 మంది రైతులు తీసుకున్న రూ. 8 కోట్ల పంట రుణాలు, రూ. 22 కోట్ల దీర్ఘకాలిక రుణాలను అసలైన రైతులు తీసుకున్నారని మిగతావన్నీ తప్పుడు లెక్కలే అని తేల్చారు. ఈ కుంభకోణానికి పాల్పడ్డ అప్పటి అధికారులు సిబ్బందిపై సివిల్‌, క్రిమినల్ చర్యలు ఉంటాయని సహకార శాఖ సహాయ రిజిస్ట్రార్‌ రంగనాయకులు తెలిపారు.

భూ యజమాని బతికుండగానే డెత్‌ సర్టిఫికెట్‌ - 6 ఎకరాలు అక్రమ రిజిస్ట్రేషన్

'మేము రైతులం కాదు, కనీసం కూలీలం కూడా కాదు. నేనూ, మా తప్పుడు ప్రైవేటు ఉద్యోగం చేసుకంటున్నాం. మా పేరు మీద లక్ష రూపాయల లోను ఎలా తీసుకుంటారు.' - బాధితుడు

అధికారులు నివేదిక చదువుతుండగా కొందరు రైతులు అడ్డుతగిలారు. 6 నెలల్లో పూర్తి కావాల్సిన విచారణను సాగదీశారని చర్యలు తీసుకోవడానికి ఇంకెన్నాళ్లు కావాలని నిలదీశారు. ఆ 104 కోట్లు రాబట్టాకే రైతుల నుంచి బకాయిలు వసూలు చేయాలని తేల్చిచెప్పారు. కిర్లంపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో 2012 నుంచి 2023 వరకు చోటుచేసుకున్న ఆర్థిక మోసాలపై గత డిసెంబర్‌లో పెద్దాపురం డివిజనల్‌ సహకార అధికారి పద్మ విచారణ చేపట్టారు.

104 కోట్లకుపైగా నిధుల దుర్వినియోగంతో ప్రమేయమున్న మాజీ సీఈవో రాజబాబు, మాజీ అధ్యక్షుడు మూర్తి మృతి చెందగా మిగతావారు వివిధ హోదాల్లో పని చేస్తున్నారు. ఈ కుంభకోణం కుట్రదారులపై ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా లేదా అన్నది తేలాల్సి ఉంది.

గాడిద పాలతో ఘరానా మోసం - లబోదిబోమంటున్న రైతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.