Prathidhwani on Stock Market : ఒక్కసారిగా ఊహించని రీతిలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు మూట గట్టుకున్నాయి. ఒక్క రోజు వ్యవధిలో 15 లక్షల కోట్ల రూపాయల మదుపర్ల సంపద ఆవిరైంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో సోమవారం ఆరంభంలోనే ఏకంగా 2,400 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్ ఒకదశలో 2600 పాయింట్ల వరకు నష్టాల్లోకి జారుకుంది. ఓ దశలో 24 వేల స్థాయిని కూడా కోల్పోయింది. తర్వాత కాస్త కోలుకున్నా తీవ్ర నష్టాలు తప్పలేదు. 24 వేల ఎగువన ముగిసింది. దలాల్ స్ట్రీట్‌లో ఒక్కసారిగా ఏర్పడిన కుదుపు కారణంగా రూ.15 లక్షల కోట్లు ఆవిరైంది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.457 లక్షల కోట్ల నుంచి రూ.442 లక్షల కోట్లకు పడిపోయింది.
మాంద్యం భయంతో స్టాక్ మార్కెట్ల పతనం - కలవరపెడుతున్న ప్రస్తుత పరిస్థితులు - Debate on Stock Market - DEBATE ON STOCK MARKET
Prathidhwani on Stock Market : దేశీయ స్టాక్ మార్కెట్లు ఊహించని రీతిలో భారీ నష్టాలు మూట గట్టుకున్నాయి. గంటల వ్యవధిలోనే ఏకంగా రూ.15 లక్షల కోట్ల రూపాయల మదుపర్ల సంపద ఆవిరైపోయింది. ఇంతటి పతనం, ఇంతటి భారీ నష్టాలకు కారణాలు ఏమిటి? అమెరికాలో ఆర్ధికమాంద్యం ఛాయలు అంతగా ముసురుకున్నాయా? అసలు అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఏం జరుగుతోంది? అమెరికాలో ఏ చిన్న పరిణామం జరిగినా ప్రపంచ మార్కెట్లు ఇంతగా ఎందుకు వణికిపోతాయి? ఈ ఇంపాక్ట్ ఇంకా ఎంతవరకు ఉండొచ్చనే వివరాలు నేటి ప్రతిధ్వని లో తెలుసుకుందాం.
Prathidhwani on Stock Market (ETV Bharat)
Published : Aug 6, 2024, 9:49 AM IST
Debate on Stock Market :మార్కెట్‌ను నిరంతరం ఎన్నో వార్తలు ప్రభావితం చేస్తుంటాయి. కొన్నింటికి పాజిటివ్, మరికొన్నింటికి ప్రతికూలంగానూ మార్కెట్ స్పందిస్తుంది. ఈ కదలికల్ని ఎలా గమనించాలి? ఇటీవలి కాలంలో మార్కెట్ లాభాలు చూసిన చాలామంది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లతో పాటు, నేరుగా షేర్లలోనూ ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటివాళ్ళు ఇప్పుడేం చేయాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.