Prathidhwani on How to Save Rain Water : తాగునీటి కోసం మహా నగరాలు అల్లాడిపోతున్నాయి. కోట్లాది గొంతులు నీటికోసం అర్రులు చాస్తున్న పూర్వ రంగంలో నైరుతి రుతుపనవాలు కేరళలో ప్రవేశించాయి. మరో వారంలో తెలుగు రాష్ట్రాలను తాకనున్నాయి. ఈ వానాకాలంలోనైనా వర్షపు నీటిని ఒడిసిపట్టే ఆలోచనలు చేయాలి. భూగర్భ జలాలను పెంచుకోవాలి. దాహం వేసినప్పుడే బావి తవ్వుకునే అలక్ష్యాన్ని విడనాడాలి. వాననీటి ప్రవాహాన్ని వాగులు, చెరువులు, కుంటలు, ఇంకుడు గుంతల్లోకి మళ్లించి నిల్వ చేయాలి.
అసలే ఎండాకాలం, ఆపై నీటికొరత - మన్యం జిల్లాలో గిరిజనుల దాహం కేకలు - Tribals Drinking Water Problem
వర్షాకాలంలో వాన నీటి సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలేంటి? ఇళ్లు, కార్యాలయాల్లో నీటి వృధాను అరికట్టి, నిల్వ సామర్థ్యం పెంచుకోవడం ఎలా? భవిష్యత్ తరాలకు తాగునీటి ఎద్దడిని తీర్చటం ఎలా? ఇదీ నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్నవారు వాననీటి సంరక్షణ కోసం అనేక ఉద్యమాలు, అవగాహన కార్యక్రమాలు చేస్తూ పలు అవార్డులు అందుకున్న వాక్ ఫర్ వాటర్ సంస్థ వ్యవస్థాపకుడు ఎం. కరుణాకర్‌రెడ్డి, వాటర్‌షెడ్లు, ఇంకుడుగుంతల ద్వారా నీటి సంరక్షణ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న వాసన్ సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్ ఎం.వి.రామచంద్రుడు.
ఎండలు మండుతున్న వేళ గ్రామాల గొంతెండుతోంది! పట్టించుకోని అధికారులు - Drinking Water Problems in Prakasam