School Students Fake Kidnap in kurnool District : కర్నూలు జిల్లాలో కలకలం రేపిన ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్ వ్యవహారం ఫేక్ అని తేలిపోయింది. సి బెళగల్ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న 6వ తరగతి విద్యార్థి, 7వ తరగతి విద్యార్థి భోజన విరామ సమయంలో కిడ్నాప్‌నకు గురయ్యారని మరో విద్యార్థి ప్రిన్సిపాల్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఆందోళన చెందిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కొద్దిసేపటికే ఈ వ్యవహారం మీడియాలో చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మిగనూరులోని శివ సర్కిల్ సెంటర్లో నిల్చుని ఉన్న విద్యార్థులను స్థానికులు గమనించి పోలీసులకు అప్పగించారు. వారిని విచారించగా స్కూలు నుంచి తప్పించుకోవటానికి ఎమ్మిగనూరు వచ్చామని ఇదంతా నాటకమని చెప్పటంతో పోలీసులు ముక్కున వేలేసుకున్నారు. విద్యార్థులను పోలీసులు పాఠశాలకు తరలించారు.
తల్లికి రోడ్డు ప్రమాదం జరిగిందని కిడ్నాప్ - చాకచక్యంగా తప్పించుకున్న బాలిక
హాస్టల్‌లో చేర్పిస్తారనే భయంతో కిడ్నాప్ డ్రామా - విస్తుపోయిన పోలీసులు