'కమలాహారిస్ - డొనాల్డ్ ట్రంప్' - అగ్రరాజ్యం అమెరికాకు అధిపతి అయ్యేదెవరు? - Who Will be USA President - WHO WILL BE USA PRESIDENT
ప్రపంచ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు - అగ్రరాజ్యపీఠాన్ని అధిష్టించేదెవరు - విశ్లేషకులు ఏమంటున్నారు
Published : Oct 6, 2024, 10:26 AM IST
Prathidhwani On America Presidential Polls :అమెరికా తమ అధ్యక్ష పీఠంపైకి మహిళకు మొదటిసారి అవకాశం ఇస్తుందా? అది కూడా భారత సంతతి మూలాలన్న ఓ మహిళ ప్రపంచాన్ని శాసించే శ్వేతసౌధానికి అధిపతి అవుతారా? లేదంటే వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ ట్రంప్‌నకు రెండవ ఛాన్స్ చిక్కుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం వేగంగా దగ్గర పడుతోంది. సరిగ్గా నెల రోజులే మిగిలింది. ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తున్న ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అక్కడ ఎర్లీ పోలింగ్ కూడా ప్రారంభమైంది. లక్షలమంది తమ తీర్పును ఓట్ల రూపంలో నిక్షిప్తం చేస్తున్నారు. మరి ఈ అమీతుమీ పోరాటంలో 'కమలాహారిస్ - డొనాల్డ్ ట్రంప్' మధ్య ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయి? అమెరికా అధ్యక్ష ఎన్నికలను శాసించనున్న అంశాలేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.